Vivo X200
Vivo X200 : వివో లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా వివో X200 ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, లుక్, అద్భుతమైన కెమెరాలతో కూడిన కొత్త ఫోన్ కావాలంటే ఈ వివో ఫోన్ కొనేసుకోవడమే బెటర్. వివో X200 అద్భుతమైన ఫోన్ బ్యాంక్ ఆఫర్లు, బోనస్‌లతో అందుబాటులో ఉంది. రూ. 6వేల కన్నా ఎక్కువ ఆదా సేవ్ చేసుకోవచ్చు.
ఈ వివో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా ఈ వివో ఫోన్ 3 కెమెరాలను కలిగి ఉంది. మీ సెలవు సీజన్‌లో ఈ కెమెరా-ఫోకస్డ్ గాడ్జెట్‌ను వాడాలనుకుంటే అమెజాన్‌లో వివో X200 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో వివో X200 ధర ఎంతంటే? :
వివో X200 మొదట్లో రూ.74,999 ధరకు లభించేది. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.68,999కి లభిస్తుంది. తద్వారా రూ.6వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,069 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మీరు ఫ్రీ ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తేనే ఈ డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Google Pixel 9 Pro XL : వారెవ్వా.. ఆఫర్ కేక బ్రో.. ఈ పిక్సెల్ 9 ప్రో XL అతి చవకైన ధరకే.. ఇలా కొన్నారంటే..!
నెలకు రూ.3,345 ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు. మీ పాత గాడ్జెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ప్లాట్‌ఫామ్ ట్రేడ్-ఇన్ ఫీచర్ ఉపయోగించి రూ. 44,450 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ, మీ డివైజ్ బ్రాండ్, మోడల్ కండిషన్‌ను బట్టి డిస్కౌంట్ మారుతుంది.
వివో X200 ఫీచర్లు
వివో X200 ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. HDR10 ప్లస్‌కు సపోర్టు ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్ హుడ్ కింద డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ కలిగి ఉంది.
5,800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఈ గాడ్జెట్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది. ఫ్రంట్, బ్యాక్ గాజుతో ఉంటుంది. అలాగే, వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ69 గ్రేడ్ కలిగి ఉంది.