Google Pixel 9 Pro XL : వారెవ్వా.. ఆఫర్ కేక బ్రో.. ఈ పిక్సెల్ 9 ప్రో XL అతి చవకైన ధరకే.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9 Pro XL : వారెవ్వా.. ఆఫర్ కేక బ్రో.. ఈ పిక్సెల్ 9 ప్రో XL అతి చవకైన ధరకే.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 9 Pro XL

Updated On : December 24, 2025 / 6:42 PM IST

Google Pixel 9 Pro XL : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌ లాంచ్ తర్వాత ఈ మోడల్ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఇప్పుడు, గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చవకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు అర్హత కలిగిన బ్యాంక్ ఆఫర్లతో రూ.39వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ రూ.1,24,999కి లాంచ్ కాగా ఇప్పుడు రూ.86 వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ధర వద్ద కస్టమర్‌లు ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్, అమోల్డ్ డిస్‌ప్లే, గూగుల్ టెన్సర్ చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర రూ.1,24,999కి లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం రూ.89,999కి లిస్ట్ అయింది. రూ.35వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

అలాగే, ఫ్లిప్‌కార్ట్, యాక్సెస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేసేటప్పుడు రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా రూ.68,050 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Flipkart Year End Sale : ఇయర్ ఎండ్ ఆఫర్ అదుర్స్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. జస్ట్ ఎంతంటే?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hz రిఫ్రెష్ 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే, డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 9 ప్రో XLటైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 5,060mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో XLలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కూడా ఉంది.