Flipkart Year End Sale : ఇయర్ ఎండ్ ఆఫర్ అదుర్స్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. జస్ట్ ఎంతంటే?

Flipkart Year End Sale 2025 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 ధర భారీగా తగ్గింది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Flipkart Year End Sale : ఇయర్ ఎండ్ ఆఫర్ అదుర్స్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. జస్ట్ ఎంతంటే?

Flipkart Year End Sale 2025

Updated On : December 24, 2025 / 6:29 PM IST

Flipkart Year End Sale 2025 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ మొదలైంది. మీ బడ్జెట్‌కు సరిపోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ కొనడం బెటర్. ప్రస్తుతం రూ. 20వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

అంతే కాదు, అనేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చవకైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో ఫీచర్లు చాలా అడ్వాన్స్, ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే మీరు కచ్చితంగా ఇష్టపడతారు. కొత్త ధర ఎంతంటే? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A35 5జీపై ఫ్లిప్‌కార్ట్ సేల్ డిస్కౌంట్ :
ఈ శాంసంగ్ మోడల్ ధర రూ. 33999గా ఉంది. ఈ సేల్ సమయంలో 8GB, 128GB వేరియంట్ 46శాతం తగ్గింపుతో పొందవచ్చు. తగ్గింపు తర్వాత ధర రూ. 18,499 అవుతుంది. బ్యాంక్ ఆఫర్లతో మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 925 తగ్గింపు పొందవచ్చు.

Read Also : Year End Sales 2025 : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ 10 SUVలపై ఏకంగా రూ. 4.45 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్లు..

అదనంగా, అన్ని నిబంధనలు, షరతులకు లోబడి రూ. 8300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీరు రూ. 3084 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

భారీ డిస్‌ప్లే :
ఈ ఫోన్ మోడల్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ FHD+ డిస్‌ప్లే, 2340×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కలిగి ఉంది.

పర్ఫార్మెన్స్, ర్యామ్ :
స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఎక్సినోస్ 1380 (5nm) ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB + 12GB ర్యామ్, 128GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. స్టోరేజ్‌ మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు.

కెమెరా క్వాలిటీ
ఫొటోలు, వీడియోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

బ్యాటరీ అండ్ ఛార్జింగ్ :
పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ పవర్‌ఫుల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25-వాట్ వైర్డ్ ఛార్జర్‌తో కూడా వస్తుంది. ఇతర ఫీచర్లలో IP67 రేటింగ్, Wi-Fi, బ్లూటూత్, ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.