Year End Sales 2025 : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ 10 SUVలపై ఏకంగా రూ. 4.45 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్లు..

Year End Sales 2025 : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. టాటా, హ్యుందాయ్, మహీంద్రా ఎస్ యూవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Year End Sales 2025 : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ 10 SUVలపై ఏకంగా రూ. 4.45 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్లు..

Year End Sales 2025

Updated On : December 24, 2025 / 5:41 PM IST

Year End Sales 2025 : కొత్త సంవత్సరం రాబోతుంది. 2025 ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు కార్లపై భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఆటో దిగ్గజాలైన టాటా-మహీంద్రా, మారుతి సుజుకి నుంచి కియా-ఎంజి, స్కోడా వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు తమ పాపులర్ మోడళ్లపై వేల లక్షల రూపాయల విలువైన బెనిఫిట్స్ అందిస్తున్నాయి.

మీరు టాటా నెక్సాన్ లేదా మహీంద్రా థార్ రాక్స్ కొనుగోలు చేసినా లేదా మీ ఆప్షన్ స్కోడా కుషాక్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా నుంచి ఎంజీ గ్లోస్టర్ లేదా మహీంద్రా స్కార్పియో వరకు ఏదైనా కొనుగోలు చేసినా భారీ మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. దేశీయ మార్కెట్లో 10 పాపులర్ SUVలపై ఈ నెలలో ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాండ్ మోడల్ కార్లను కొనేసుకోవచ్చు..

మహీంద్రా XUV400పై రూ. 4.5 లక్షలు ఆదా :
ఈ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, XUV400పై కస్టమర్లు రూ. 4.45 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఏడాదిలో XUV400 అమ్మకాలు భారీగా తగ్గాయి. కంపెనీ స్టాక్ క్లియర్ చేసేందుకు భారీ తగ్గింపులను అందిస్తోంది.

MG గ్లోస్టర్‌పై రూ. 4 లక్షల వరకు తగ్గింపు :
ఈ డిసెంబర్‌లో, JSW MG మోటార్ ఇండియా పాపులర్ ఫుల్ సైజ్ SUV, గ్లోస్టర్‌పై కస్టమర్‌లు రూ. 4 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. భారీ SUV కార్లపై ఈ నెలలో అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.

స్కోడా కుషాక్‌పై రూ. 3.25 లక్షల వరకు తగ్గింపు :
స్కోడా ఆటో పాపులర్ మిడ్‌సైజ్ SUV, కుషాక్, ప్రస్తుతం రూ. 3.25 లక్షల వరకు మొత్తం సేవింగ్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ కుషాక్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానుంది.

Read Also : iPhone 16 Sale : ఆపిల్ లవర్స్ అసలు మిస్ చేయొద్దు.. ఈ ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధరకే.. ఇలాంటి డీల్ ఎప్పుడూ చూసి ఉండరు..!

మహీంద్రా XUV700పై రూ. 1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్ :
మహీంద్రా అండ్ మహీంద్రా పవర్‌ఫుల్ SUV, XUV700 మోడళ్లను ఈ నెలలో రూ. 155,600 వరకు ఇయర్ ఎండ్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. SUV ఫేస్‌లిఫ్టెడ్ మోడల్, XUV7XO, వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానుంది.

కియా సెల్టోస్‌లో రూ. 1.5 లక్షలకు పైగా తగ్గింపు :
ఈ నెలలో కియా ఇండియా ఆకట్టుకునే మిడ్‌సైజ్ SUV సెల్టోస్‌పై రూ. 1.6 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో ఇయర్ ఎండ్ ఆఫర్‌లు ఉన్నాయి. ముఖ్యంగా రూ.40వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. కొత్త సెల్టోస్ కూడా ఇటీవలే ఆవిష్కరించగా ఈ మోడల్ ధరలు జనవరి 2, 2025 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ పై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు :
మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా అమ్ముడైన SUV మోడళ్లలో స్కార్పియో క్లాసిక్ ఒకటి. ఈ నెలలో రూ. 1.40 లక్షల వరకు సేవ్ చేయవచ్చు. ఇయర్ ఎండ్ ఆఫర్ సమయంలో మహీంద్రా SUV మోడల్స్ భారీ తగ్గింపు అందిస్తున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగన్‌పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు :
వోక్స్‌వ్యాగన్ ఇండియా పాపులర్ మిడ్‌సైజ్ SUV,టిగన్ ఈ నెలలో రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. టిగన్ ఆకట్టుకునే లుక్స్ ఫీచర్ల కారణంగా పాపులర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మహీంద్రా థార్ రాక్స్ లక్షకు పైగా తగ్గింపు :
ఈ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యంత పాపులర్ SUV మోడల్ థార్ రాక్ పై రూ. 1.20 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. థార్ రాక్ అనేది ఆకట్టుకునే లుక్స్ ఫీచర్లతో కూడిన ఆఫ్-రోడ్ SUV కారుగా చెప్పొచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు :
ఇయర్ ఎండ్ డిస్కౌంట్లతో మారుతి సుజుకి ఆకట్టుకునే మిడ్‌సైజ్ SUV గ్రాండ్ విటారాపై రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. విక్టోరియాస్ పాపులారిటీతో గ్రాండ్ విటారా అమ్మకాలు ఇటీవలి నెలల్లో తగ్గాయి. ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు భారీగా పెరగవచ్చు.