Vivo X300 Pro Price : వివో X300 ప్రోపై అదిరే డీల్.. ఇప్పుడే కొనేస్తారా? వివో X500 కోసం వెయిట్ చేస్తారా?
Vivo X300 Pro Price : వివో ఎక్స్300 ప్రో ధర రూ. 1,01,599కే లభిస్తోంది. ఇది కొనాలా? వివో ఎక్స్500 కోసం ఆగాలా? ధర, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ వివరాలపై ఓసారి లుక్కేయండి..
Vivo X300 Pro Price
- ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో వివో X300 ప్రో రూ. 1,01,599కే లభ్యం
- వివో X500లో డైమెన్సిటీ 9600M చిప్, 64MP టెలిఫోటో కెమెరా 7,500mAh బ్యాటరీ
- భారీ ఎల్టీపీఓ డిస్ప్లే 200MP టెలిఫోటో కెమెరా, వివో X300 ప్రో బెస్ట్ ఆప్షన్
Vivo X300 Pro Price : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. వివో X300 ప్రో ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్లో ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. మరోవైపు, త్వరలో రాబోయే వివో X500 సిరీస్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడే వివో X300 ప్రో కొనాలా? కొత్త ఫోన్ కోసం వేచి చూడాలా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో ఎక్స్300 ప్రో ధర ఎంతంటే? :
వివో ఎక్స్300 ప్రో (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్) అసలు ధర రూ. 1,19,999కు లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ (Vivo X300 Pro Price) యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో రూ. 18,400 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో వివో ఫోన్ ధర రూ. 1,01,599కు చేరుతుంది. HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా రూ. 14,400 వరకు తగ్గింపు పొందవచ్చు. కొన్ని యూపీఐ పేమెంట్లపై కూడా మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
వివో ఎక్స్300 ప్రో స్పెషాలిటీలు :
ఈ ఫోన్లో ఫ్లాగ్షిప్ మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్సెట్ ఉంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో 200MP టెలిఫోటో కెమెరా, భారీ ఎల్టీపీఓ డిస్ప్లే, 6,510mAh బ్యాటరీ ఉన్నాయి. ప్రీమియం పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ కోరుకునేవారికి అదిరిపోయే ఆప్షన్.
వివో ఎక్స్500 కోసం వేచి చూడాలా? :
వివో ఎక్స్500 సిరీస్పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకుల ప్రకారం.. వివో ఎక్స్500లో చిన్న ఎల్టీపీఎస్ డిస్ప్లే, డైమన్షిటీ 9600M చిప్సెట్, 64MP టెలిఫోటో కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. బ్యాటరీ కెపాసిటీ 7,500mAh వరకు ఉండవచ్చని అంచనా. భారత మార్కెట్లో లాంచ్ తేదీ, ధరపై ఇంకా క్లారిటీ లేదు.
ఏ ఫోన్ కొనడం బెటర్? :
మంచి కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే కావాలంటే వివో ఎక్స్300 ప్రోను పరిశీలించవచ్చు. కొత్త టెక్నాలజీ కోసం చూస్తుంటే వివో ఎక్స్500 సిరీస్ అధికారిక వివరాలు వచ్చే వరకు ఆగడం మంచిది.
మొత్తంగా ఇప్పుడే ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలంటే వివో X300 ప్రో కొనడమే బెటర్. కొన్నాళ్లు ఆగుతామంటే వివో ఎక్స్500 సిరీస్ వివరాలు రివీల్ అయ్యేవరకు వేచి ఉండాల్సిందే.. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్లు, అధికారిక స్పెసిఫికేషన్లను తప్పనిసరిగా చెక్ చేయండి.
