Vivo Smartphones : వివో యూజర్లకు ఊహించని షాక్.. ఈ మోడళ్లపై భారీ ధరల పెంపు!
Vivo Smartphones : వివో మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెంచింది. వివో V70 ఎలైట్, వివో V70, వివో Y21 స్మార్ట్‌ఫోన్‌ల ధరలను కంపెనీ రూ. 1,000 నుంచి రూ. 4వేల వరకు పెంచింది.
- Sreehari A
- Published on- June 16, 2026 / 04:07 PM IST
Vivo Smartphones
- వివో V70 ఎలైట్ నుంచి వివో V70 వరకు ధరల పెంపు
- రూ. 1000 నుంచి రూ. రూ. 4వేలు పెరిగిన వివో ఫోన్లు
- మెమెరీ చిప్ కొరత కారణంగానే ఫోన్ల ధరల పెంపు
Vivo Smartphones : కొత్త వివో ఫోన్ కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. 2026లో అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ భాగాల కొరత ఫోన్ల ధరల పెంపునకు కారణమని చెప్పొచ్చు. ఇటీవలే వివో Y సిరీస్‌లోని 4 స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి. వివో V70, వివో V70 ఎలైట్‌తో పాటు వివో Y21, వివో Y400 ధరలు పెరిగాయి.
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ. వెయ్యి నుంచి రూ. 4వేల వరకు పెరిగాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో (Vivo Smartphones) ధరల పెంపు లేనప్పటికీ, కంపెనీ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను మాత్రం భారీగా పెంచేసింది.
వివో V70 ఎలైట్ ధర :
ఈ ఫోన్‌లోని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54999 నుంచి రూ. 58999 పెరిగింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59999 నుంచి రూ. 63999కి పెరిగింది.
వివో V70 :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB వేరియంట్ ధర రూ. 49,999 నుంచి రూ. 53,999 పెరిగింది. 12GB ర్యామ్/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 53,999 నుంచి రూ. 56,999కి ధర పెరిగింది.
వివో Y21 ధర :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ఇప్పుడు రూ. 20,999 నుంచి రూ. 21,999 పెరిగింది.
వివో Y400 ధర :
ఈ ఫోన్ 2 వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది. 128GB వేరియంట్ ధర రూ. 28,999 నుంచి రూ. 31,999కి పెరిగింది.
256GB వేరియంట్ ధర రూ. 31,999 నుంచి రూ. 34,999కి పెరిగింది. వివో వెబ్‌సైట్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కొత్త ధరలతో లిస్టు అయ్యాయి. అయితే, కంపెనీ ఈ వివో ఫోన్ల ధరల పెంపును అధికారికంగా ప్రకటించలేదు.
