Vivo Y28 5G Price in India, Design, Colour Options Tipped
Vivo Y28 5G Price in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. వివో Y28 5జీ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో ఆవిష్కరించిన వివో Y27 5జీకి ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి మోడల్ కన్నా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఈ 5జీ ఫోన్ ఇటీవల అనేక సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించింది. ఇప్పటికే, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఇప్పుడు వివో Y28 5జీ డిజైన్, కలర్ ఆప్షన్లకు సంబంధించిన స్ర్కీన్‌షాట్ నివేదిక షేర్ చేసింది. ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు, రాబోయే హ్యాండ్‌సెట్ ధరను కూడా సూచిస్తుంది.
భారత మార్కెట్లో క్రిస్టల్ పర్పుల్, గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్లలో వివో Y28 5జీ త్వరలో లాంచ్ అవుతుందని నివేదిక సూచిస్తుంది. నివేదిక కచ్చితమైన లాంచ్ తేదీని పేర్కొనలేదు. అయితే, రాబోయే ఈ హ్యాండ్‌సెట్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజీ ఎంపికలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సూచిస్తుంది. నివేదిక ప్రకారం.. వివో Y28 5జీ 4జీబీ + 128జీబీ ప్రారంభ ధర రూ. 13,999 ఉండనుంది. అయితే 6జీబీ + 128జీబీ, 8జీబీ + 128జీబీ ఆప్షన్ల ధర వరుసగా రూ. 15,499, రూ. 16,999 మధ్య ఉండవచ్చు. అంతేకాకుండా, పైన పేర్కొన్న ధరలపై కంపెనీ అదనంగా 2.7 శాతం తగ్గింపును అందజేస్తుందని నివేదిక పేర్కొంది.
రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
వివో Y28 5జీ కొనుగోలు సమయంలో రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందించనుంది. కస్టమర్‌లు ఈఎంఐతో రోజుకు రూ. 31 కన్నా తక్కువ ధరతో ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. నివేదికలో షేర్ చేసిన ఫొటో ప్రకారం.. వివో Y28 5జీ బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో నిలువుగా అమర్చిన ప్రత్యేక వృత్తాకార యూనిట్లతో హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. వృత్తాకార ఎల్ఈడీ ఫ్లాష్ రెండో కెమెరా కింద ఉంచబడినట్లు కనిపిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కనిపిస్తాయి.
Vivo Y28 5G Price in India
ఇటీవల బ్లూటూత్ ఎస్ఐజీ, వివో వై28 5జీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్లలో కనిపించిందని (MySmartPrice) నివేదిక పేర్కొంది . మాలి జీ57 ఎంపీ2 జీపీయూతో జత చేసిన 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను ఫోన్ కలిగి ఉండవచ్చని జాబితాలు సూచించాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ ప్రధాన కెమెరా సెన్సార్ ఉండవచ్చని భావిస్తున్నారు. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా అందిస్తుంది. వివో Y27 5జీ, మీడియాటెక్ డైమన్షిటీ 6020 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13తో వస్తుంది. 6.64-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,388 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది.
వివో Y27 5జీ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లు :
కెమెరా విభాగంలో వివో Y27 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, వెనుకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో 8ఎంపీ సెన్సార్ డిస్‌ప్లే పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 15డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ (ప్రాంతాన్ని బట్టి), జీపీఎస్/ ఎ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, ఓటీజీ కనెక్టివిటీని పొందుతుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
వివో Y27 5జీ భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కానప్పటికీ.. మోడల్ 4జీ వేరియంట్ ఈ ఏడాదిలో జూలైలో దేశంలో లాంచ్ అయింది. ప్రస్తుతం భారత మార్కెట్లో వివో Y27 4జీ ఫోన్ 6జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర రూ. 12,999కు అందించనుంది. బుర్గుండి బ్లాక్, గార్డెన్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందించనుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీని కలిగి ఉంది. 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.