Vivo Y300 5G Launch : వివో కొత్త 5జీ ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
Vivo Y300 5G Launch : భారత మార్కెట్లో వివో వై300 5జీ ధర రూ. 21,999కు పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా దేశంలో ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంది. నవంబర్ 26 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

Vivo Y300 5G Launch
Vivo Y300 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై300 5జీ వచ్చేసింది. 6.67-అంగుళాల ఫుల్-హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్సెట్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ సపోర్టుతో వస్తుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో అమర్చి ఉంది. ఐపీ64-రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. 6ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ, 6.78-అంగుళాల ఫుల్-హెచ్డీ స్క్రీన్, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అక్టోబర్‌లో వివో వై300 ప్లస్ హ్యాండ్‌సెట్‌లో స్మార్ట్‌ఫోన్ చేరింది.
భారత్‌లో వివో వై300 5జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో వై300 5జీ (8జీబీ+ 128జీబీ) ఆప్షన్ ప్రారంభ ధర రూ. 21,999గా ఉంటే.. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 23,999కు పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా దేశంలో ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంది. నవంబర్ 26 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
ఎంపిక చేసిన కస్టమర్లు వివో వై300 5జీ కొనుగోలుపై రూ. వెయ్యి ఇన్స్టంట్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. సేల్ తేదీకి ముందు హ్యాండ్‌సెట్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కొనుగోలుదారులు లావాదేవీ సమయంలో రూ. 2వేల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా రోజుకు రూ. 43 ఈఎంఐ రేటుతో కొనుగోలు చేయొచ్చు. వివో వై300 5జీ కొనుగోలు చేసే కస్టమర్లు అదనంగా రూ. 1499 ధరతో వివో టీడబ్ల్యూఎస్ 3ఇ కొనుగోలు చేయవచ్చు. వివో వై300 5జీ మొత్తం ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
వివో వై300 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో వై300 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్డీ+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్లోకల్ పీక్ బ్రైట్నెస్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 256జీబీ వరకు ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా అదనంగా 8జీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 2టీబీ వరకు పొడిగించవచ్చు. ఈ హ్యాండ్సెట్ పైన ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14 స్కిన్‌తో వస్తుంది.
కెమెరా విభాగంలో వివో వై300 5జీ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరాలు ఏఐ-బ్యాక్డ్ ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ కూడా ఉంది.
వివో వై300 5జీ 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోన్‌ను 30 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతానికి ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఓటీజీ, జీపీఎస్, బెయిడూ, GLONASS, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, NavIC, జీఎన్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
భద్రత విషయానికి వస్తే.. ఫోన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్సెట్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. వివో వై300 5జీ ఎమరాల్డ్ గ్రీన్ ఫాంటమ్ పర్పుల్ వేరియంట్స్ 163.23x 75.93×7.79ఎమ్ఎమ్ పరిమాణం, 188 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. హ్యాండ్సెట్ టైటానియం సిల్వర్ ఆప్షన్ కొద్దిగా మందంగా 7.95ఎమ్ఎమ్ బరువు 190 గ్రాములు ఉంటుంది.