×
Ad

Vivo Y31d Launch : వివో కొత్త ఫోన్ అదుర్స్.. 7200mAH భారీ బ్యాటరీతో కిర్రాక్ ఫీచర్లు.. వాటర్‌లో పడినా డోంట్ కేర్.. ఎలా కొనాలంటే?

Vivo Y31d Launch : వివో నుంచి అద్భుతమైన ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

  • Published On : January 29, 2026 / 01:04 PM IST
1/8
Vivo Y31d Launch : వివో ఫ్యాన్స్ కోసం సరికొత్త ఫోన్ వచ్చేసింది. కంబోడియా వియత్నాం సహా ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లో వివో నుంచి Y31d మోడల్ లాంచ్ అయింది. ఈ చైనా బ్రాండ్ లేటెస్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4G నెట్‌వర్క్‌లకు మాత్రమే సపోర్టు ఇస్తుంది.
2/8
50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత (OriginOS6)పై రన్ అవుతుంది. IP69 ప్లస్ రేటింగ్‌తో వస్తుంది. 7,200mAh పవర్‌ఫుల్ భారీ బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంది. ఈ వివో Y31d ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
3/8
వివో Y31d ఫీచర్లు : వివో Y31d ధరకు సంబంధించి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. ఈ వివో ఫోన్ గ్లో వైట్, స్టార్‌లైట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ప్రస్తుతానికి వివో Y31d ఫోన్ వివో కంబోడియా, వియత్నాం వెబ్‌సైట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
4/8
వివో Y31d ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వివో Y31d ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో + నానో) ఆండ్రాయిడ్ 16 ఆధారంగా (OriginOS6)పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 256పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 1250 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.
5/8
6.75-అంగుళాల (720 x 1,570 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్‌ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6nm SoC, 6GB LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.
6/8
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో Y31d 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP షూటర్ ఉంది.
7/8
కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యూఎస్‌బీ 2.0, జీపీఎస్, BeiDou, GLONASS, గెలీలియో, QZSS, యూఎస్‌బీ ఓటీజీ USB టైప్-సి ఉన్నాయి. ఇందులో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉన్నాయి.
8/8
ఈ వివో ఫోన్ సైజు (166.64×78.43×8.39mm), 219 గ్రాముల బరువు ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కాంపోజిట్ ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నాయి. IP68 + IP69 + IP69+ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,200mAh లిథియం-అయాన్ బ్యాటరీని అందిస్తుంది.