Vivo Y39 5G: భారత్‌లో వివో వై39 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. తక్కువ ధరకే ఎంత బాగుందో తెలుసా?
ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని స్మార్ట్ ఫోన్లలాగానే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

భారత మార్కెట్లో వివో తన లేటెస్ట్ వివో వై39 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డే మొత్తం ఛార్జింగ్ వచ్చేలా 6,500mAh సామర్థ్యంతో బ్యాటరీ, అలాగే ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి సోనీ 50MP AI వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్
వివో వై39 5జీ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. మెటాలిక్ ఫ్రేమ్, అలాగే వృత్తాకార కెమెరాతో తేలికైన డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.68 అంగుళాల డిస్‌ప్లే ఉంది. కళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఐ ప్రొటెక్షన్ ఉంది. అలాగే సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
రెండు స్టీరియో స్పీకర్లు ఉండడం వల్ల ఆడియో మనకు క్లారిటీగా వినపడుతుంది. ఇంకా ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని స్మార్ట్ ఫోన్లలాగానే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
మిలటరీ గ్రేడ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ ఫోన్ వివిధ రకాల క్లిష్టమైన పర్యావరణ పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల నాణ్యతను నిర్ధారించే SGS కంపెనీ ఈ ఫోన్ ని పరీక్షించి ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చింది. అలాగే IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ఇది వచ్చింది.
Also Read: రూ.25 వేలకే బోలెడన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్.. ఇక కెమెరా ఎలా ఉంటుందో తెలిస్తే..
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేయడం వల్ల గేమింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా హై స్పీడ్ సామర్థ్యం ఉంటుంది. ఈ ఫోన్ లో 8GB RAM ఇన్ బిల్ట్ అయ్యి ఉంది. కావాలంటే అదనంగా కూడా RAMను పెంచుకోవచ్చు. దీనివలన మల్టీ టాస్కింగ్ ను సులభంగా చేయవచ్చు.
దీనిలో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండడం వల్ల మీ డేటాను, ఫైల్స్ ను ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో, ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. అదనంగా ఇమేజ్ ఎఫెక్ట్స్ కోసం AI ఫీచర్ కూడా ఉంది
సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది Android 15తో FunTouch OS 15 పై పనిచేస్తుంది. AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, AI సూపర్‌లింక్, సర్కిల్ టు సెర్చ్, జెమినీ అసిస్టెంట్ ఉన్నాయి. ఈ డివైజ్‌లో రెండు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు అందుకోవచ్చు. Vivo Y39 5G ధర రూ.16,999 (8GB/128GB మోడల్), రూ.18,999 (8GB/256GB మోడల్)గా ఉంది. లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతుంది.