Vivo Y56 5G Launch : రూ. 20వేల లోపు ధరకే డ్యూయల్ కెమెరాలతో వివో Y56 5G బడ్జెట్ ఫోన్.. కొనే ముందు ఫీచర్లు ఓసారి లుక్కేయండి..!

Vivo Y56 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) భారత మార్కెట్లో Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ విస్తరించింది. లేటెస్టుగా డ్యూయల్ రియర్ కెమెరాలతో కూడిన Vivo Y56 ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

Vivo Y56 phone debuts with dual rear camera _ Things to know before buying

Vivo Y56 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) భారత మార్కెట్లో Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ విస్తరించింది. లేటెస్టుగా డ్యూయల్ రియర్ కెమెరాలతో కూడిన Vivo Y56 ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బడ్జెట్ కేటగిరీ డివైజ్ ధర రూ. 20వేల కన్నా తక్కువగా ఉంది. Vivo Y56 ఫోన్ గురించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Vivo Y56 5G ఫోన్ ఒకే మోడల్‌లో అందుబాటులో ఉంది. 8GB RAMని 128GB స్టోరేజ్‌తో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. నేటి నుంచి రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ Vivo స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ICICI, SBI కోటక్ మహీంద్రా కార్డులను ఉపయోగించి ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ ఫోన్ రంగు వేరియంట్‌లను అందిస్తుంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్ :
వివో Y56 5G స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో 2408×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 96శాతం NTSC కలర్, 20.07:9 యాస్పెక్ట్ రేషియోతో 90.6శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో Mali-G57 MC2 GPUతో వస్తుంది.

Vivo Y56 5G Launch : Vivo Y56 phone debuts with dual rear camera

Vivo Y56 ఫోన్ 8GB LPDDR4x RAMని 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్యాక్ చేస్తుంది. డివైజ్ మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. దీని ద్వారా స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. Vivo Y56 5G Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Funtouch OS 13 కస్టమ్ OSపై రన్ అవుతుంది. కెమెరా విధుల కోసం హ్యాండ్‌సెట్ వెనుక 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ప్రధాన కెమెరా JN1 సెన్సార్, f/1.8 ఎపర్చరుతో వస్తుంది.

f/2.4 ఎపర్చరు, LED ఫ్లాష్‌తో 2MP డెప్త్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లను పొందాలంటే.. Vivo Y56 f/2.0 ఎపర్చర్‌తో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS/GLONASS/Beidou, USB టైప్-C వంటివి Vivo Y56 5Gలో కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఐరన్ బ్లూ, టైటానియం గ్రే Vivo Y56 5G కలర్ ఆప్షన్లలో ఉంటుంది. ఈ డివైజ్ 164.05 x 75.60 x 8.15mm కొలుస్తుంది. 184 గ్రాముల బరువు ఉంది.

Read Also : Nokia X30 vs Nokia G60 : నోకియా X30, నోకియా G60 ప్రాసెసర్ సేమ్.. ధర, ఫీచర్లు ఇవే.. రెండు ఫోన్లలో ఏది బెటర్ అంటే?