Nokia X30 vs Nokia G60 : నోకియా X30, నోకియా G60 ప్రాసెసర్ సేమ్.. ధర, ఫీచర్లు ఇవే.. రెండు ఫోన్లలో ఏది బెటర్ అంటే?

Nokia X30 vs Nokia G60 : ప్రముఖ HMD గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా (Nokia) భారత మార్కెట్లో నోకియా X30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా X30 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Nokia X30 vs Nokia G60 : నోకియా X30, నోకియా G60 ప్రాసెసర్ సేమ్.. ధర, ఫీచర్లు ఇవే.. రెండు ఫోన్లలో ఏది బెటర్ అంటే?

Nokia X30 vs Nokia G60 _ How the Two smartphones with Snapdragon 695 compare

Nokia X30 vs Nokia G60 : ప్రముఖ HMD గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా (Nokia) భారత మార్కెట్లో నోకియా X30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా X30 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ అత్యంత ఖరీదైన Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. దీని ధర రూ. 48,999గా ఉంది. ఇప్పటి వరకు, Nokia G60 కంపెనీ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్. గతేడాది నవంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

నోకియా X30 vs నోకియా G60 డిస్ప్లేతో పోలిస్తే.. నోకియా X30 5G 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే పైభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లేయర్‌తో వస్తుంది. మరోవైపు, Nokia G60, 6.58-అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్‌తో వచ్చింది. డిస్‌ప్లే 500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వచ్చింది.

Read Also : Best Gaming Phones in India : భారత్‌లో రూ.30వేల లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఇవే.. ఏ గేమింగ్ ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే? ఫుల్ గైడ్ మీకోసం..!

నోకియా X30 vs నోకియా G60 ప్రాసెసర్ :
Nokia X30 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ 8GB RAMని 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. Nokia G60 కూడా అదే ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.

Nokia X30 vs Nokia G60 _ How the Two smartphones with Snapdragon 695 compare

Nokia X30 vs Nokia G60 _ How the Two smartphones with Snapdragon 695 compare

నోకియా X30 vs నోకియా G60 బ్యాటరీ :
Nokia X30 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ డివైజ్ QC 3.0, PD 3.0 సపోర్టుతో వచ్చింది. నోకియా G60.. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5G, 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC, బ్లూటూత్ 5.1, NFC, ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌ను అందిస్తాయి.

నోకియా X30 vs నోకియా G60 కెమెరాలు :
Nokia X30 వెనుక డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. f/2.4 ఎపర్చరుతో 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో f/1.8 ఎపర్చరుతో 50MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరాతో వస్తుంది. మరోవైపు, Nokia G60, f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 ఎపర్చర్‌తో 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది.

Read Also : Samsung Galaxy S23 Sale in India : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లపై సేల్.. ఏ ఫోన్ ధర ఎంతంటే? బ్యాంకు డిస్కౌంట్లు కూడా..!