Vivo Y600 Pro : కొంటే వివో ఫోన్ కొనాలి.. భారీ 10,200mAh బ్యాటరీతో వివో Y600 ప్రో అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!
Vivo Y600 Pro : వివో Y600 ప్రో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.
- Sreehari A
- Published on- April 28, 2026 / 08:04 PM IST
Vivo Y600 Pro
- వివో Y600 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10,200mAh బ్యాటరీ కూడా ఉంది
- ఆండ్రాయిడ్ 6 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 16పై రన్ అవుతుంది
Vivo Y600 Pro : వివో ఫ్యాన్స్ పండగ చేస్కోండి. ప్రముఖ హ్యాండ్‌సెట్ కంపెనీలలో ఒకటైన వివో వివో Y600 ప్రోను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10,200mAh బ్యాటరీ ఉంది. వివో Y600 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్ ఉంది.
డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ (Vivo Y600 Pro) కోసం ఫ్రంట్ కెమెరాలో 32MP కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p వరకు వీడియోను రికార్డ్ చేయగలదు.
వివో Y600 ప్రో ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,099 (సుమారుగా రూ. 29వేలు), 8GB + 256GB ధర CNY 2,299 (సుమారుగా రూ. 31,800), 8GB + 512GB ధర CNY 2,599 (సుమారుగా రూ. 35,900), 12GB + 256GB ధర CNY 2,599 (సుమారుగా రూ. 35,900), 12 GB + 512GB ధర CNY 2,899 (సుమారుగా రూ. 40వేలు). వివో Y600 ప్రో సేల్స్ చైనాలో మే 5 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్ వైలెట్, వాస్ట్ బ్లూ, బ్రైట్ మూన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Read Also : Vivo X Fold 5 : వివో ఫోల్డబుల్ ఫోన్ భలే ఉందిగా.. ఇలా కొన్నారంటే రూ. 28,400 ఆదా.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
వివో Y600 ప్రో స్పెసిఫికేషన్లు :
చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83-అంగుళాల (1,260×2,800 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 449ppi పిక్సెల్ డెన్సిటీ, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్, ఏఆర్ఎమ్ మాలి-G610 జీపీయూ ఉన్నాయి.
వివో Y600 ప్రో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
ఇందులో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ ఉన్నాయి.
వివో Y600 ప్రోలో 10,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సైజు 163.9×76.5×8.15mm, బరువు సుమారుగా 221 గ్రాములు ఉంటుంది.
