Vivo Y600 Turbo : 12GB ర్యామ్, 50MP కెమెరా, 9020mAh బ్యాటరీతో కొత్త వివో టర్బో ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్..

Vivo Y600 Turbo : వివో నుంచి అద్భుతమైన ఫీచర్లతో వివో Y600 టర్బో లాంచ్ అయింది. 12GB ర్యామ్, 50MP కెమెరా, 9020mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పూర్తి వివరాలివే..

1/9
Vivo Y600 Turbo : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేసింది. వివో Y600 టర్బో పవర్‌ఫుల్ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 9020mAh బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
2/9
కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్‌కు (2800×1260 పిక్సెల్స్) సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ప్రాసెసర్, గ్రాఫిక్స్, ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3/9
ధర, లభ్యత : చైనా మార్కెట్లో వివో వై600 టర్బో లాంచ్ అయింది. 8GB+256GB బేస్ వేరియంట్ ధర 2299 యువాన్ల (సుమారుగా రూ. 32,500) నుంచి ప్రారంభమవుతుంది. ఈ వివో ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర 2599 యువాన్లు (సుమారుగా రూ. 36,500) ఉంటుంది.
4/9
టాప్ 12GB+512GB వేరియంట్‌ను 2899 యువాన్లకు (సుమారుగా రూ. 40,500) కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను డ్యూన్ గోల్డ్, ఎలక్ట్రిక్ బ్లూ మిలీనియం పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనేసుకోవచ్చు.
5/9
స్పెసిఫికేషన్లు : వివో Y600 టర్బో ఫోన్ అనేది 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డ్యూయల్-సిమ్ ఫోన్ 2800×1260 పిక్సెల్‌ 1.5K రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. 4320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
6/9
ప్రాసెసర్ : వివో Y600 టర్బో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ అందిస్తుంది. ఈ చిప్‌సెట్ 4nm ప్రాసెసింగ్‌పై రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం కంపెనీ అడ్రెనో 810 జీపీయూను అందించింది. ఈ ప్రాసెసింగ్‌కు 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది.
7/9
కెమెరా : వివో Y600 టర్బో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 2MP డెప్త్ సెన్సార్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. రెండు కెమెరాలు EISకు సపోర్ట్ చేస్తుంది. రియర్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు.
8/9
బ్యాటరీ : వివో Y600 టర్బోలో భారీ 9020mAh బ్యాటరీ ఉంది. 1200 ఛార్జ్ తర్వాత కూడా 80 శాతం వరకు బ్యాటరీ హెల్త్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
9/9
కనెక్టివిటీ ఆప్షన్లు : వివో 5జీ ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్‌కు కంపెనీ IP68, IP69 రేటింగ్‌ అందిస్తుంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్ అందిస్తుంది. భారీ బ్యాటరీ ఉన్నా ఈ ఫోన్ కేవలం 8.29mm మందం, 215 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.