Vodafone Idea Offering Cashback On Rs 199 Recharge Plans
vodafone idea cashback : భారతీయ అతిపెద్ద టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు కోసం సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. వోడాఫోన్ ఐడియా రూ.199 రీఛార్జ్ ప్లాన్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
రూ.400 కంటే తక్కువ మొత్తంలో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై రూ.20 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రూ.400 నుంచి రూ.2,595 మధ్య రీఛార్జ్‌లపై రూ.60 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది.
ఇక అన్‌లిమిటెడ్ ప్లాన్లలో రూ.199, రూ.405 మధ్య రీఛార్జ్ కాంబో ప్లాన్లపై రూ. 20 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ప్రారంభ రీచార్జ్ ప్లాన్ రూ.199 నుంచి రూ.219, రూ.249, రూ.299, రూ.301, రూ.398, రూ.401, రూ.405లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
అలాగే రూ.499,రూ.555, రూ.558, రూ.595, రూ.601 రీఛార్జ్ లపై రూ.40 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఆపై రీచార్జ్ ప్లాన్లపై రూ.60 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ రీచార్జ్ ప్లాన్లు అన్నింటిపై 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌తో అందిస్తోంది. క్యాష్‌బ్యాక్ కూపన్లు 30 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తోంది.