Vodafone Idea: ఎయిర్‌టెల్ కంటే ఒకరోజు ముందే.. 25శాతం పెరగనున్న వొడాఫోన్ ఛార్జీలు

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ యూజర్లకు షాక్ ఇవ్వనుంది. తమ టారిఫ్ ప్లాన్ లను 20 నుంచి 25శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 ప్రకటనానుసారం....

Vodafone Idea: టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ యూజర్లకు షాక్ ఇవ్వనుంది. తమ టారిఫ్ ప్లాన్ లను 20 నుంచి 25శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23న చేసిన ప్రకటనానుసారంగా 2021 నవంబర్ 25నుంచి అమలుకానుంది.

‘ARPU ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోసెస్‌లో భాగంగా.. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక ఒత్తిడిని నిలదొక్కుకునేందుకు కొత్త ప్లాన్లు అమల్లోకి తీసుకురానున్నారు’ అని ప్రెస్ రిలీజ్ సందర్భంగా అన్నారు.

వొడాఫోన్ఐడియా గవర్నమెంట్స్ డిజిటల్ ఇండియా విజన్ ను వేగవంతం చేసే ప్రక్రియలో వేగవంతంగానే ఉంది. ఈ మేరకే సింపుల్, కన్వినెంట్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. వాయీస్, డేటా ప్రొడక్ట్ ల కోసం మంచి ప్లాన్లను రెడీ చేస్తుంది’ అని అందులో పేర్కొన్నారు.

………………………………………………. : నాజూకు అందాల నందిని

నవంబర్ 22న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లపై 20 నుంచి 25శాతం వరకూ ఛార్జీలు పెంచనున్నామని ప్రకటించిన తర్వాత ఇది వెలువడింది. ఎయిర్ టెల్ ఛార్జీలు నవంబర్ 26నుంచి అమల్లోకి రానున్నాయి. యూజర్ నుంచి వచ్చే యావరేజ్ రెవెన్యూ రూ.200 వరకూ ఉండగా.. గరిష్ఠంగా రూ.300వరకూ ఉండనుంది.

ట్రెండింగ్ వార్తలు