Threads Account Delete : ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీ థ్రెడ్స్ అకౌంట్ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు తెలుసా?

Threads Account Delete : మీ థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచే థ్రెడ్స్ అకౌంట్ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..

Want to delete your Threads account without leaving Instagram

Threads Account Delete : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) కంపెనీ ట్విట్టర్ (X)కి పోటీగా థ్రెడ్స్ అనే కొత్త సోషల్ యాప్ తీసుకొచ్చింది. ఈ ఏడాది జూలైలోనే థ్రెడ్స్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రారంభంలోనే పుల్ పాపులర్ అయింది. థ్రెడ్స్ ఫీచర్లలో సైన్ ఇన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కలిగి ఉన్న వినియోగదారులందరూ తమ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ వివరాల ద్వారా ఒకే క్లిక్‌తో థ్రెడ్స్ అకౌంట్ సైన్‌ఇన్ చేయవచ్చు. అయితే, ఇందులో ఒక ప్రతికూలత కూడా ఉంది. మీరు మీ థ్రెడ్‌ల అకౌంట్ డిలీట్ చేయాలని నిర్ణయించుకుంటే.. మీ ఇన్‌స్టాగ్రామ్ కూడా డిలీట్ అవుతుంది.

థ్రెడ్స్ ప్రొఫైల్ డిలీట్ చేయాలంటే? :

ఇటీవలి అప్‌డేట్‌లో మెటా ఈ సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు, మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి బయటకు రాకుండానే మీ థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసే సదుపాయాన్ని అందిస్తోంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. థ్రెడ్స్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రెండు కొత్త అప్‌డేట్‌లు ఉన్నాయని మోస్సేరి పేర్కొన్నారు.

Read Also : Threads Usage Drop : ‘థ్రెడ్స్’ బోర్ కొట్టేసిందిగా.. కేవలం 10 రోజుల్లోనే 50 శాతం తగ్గిన వాడకం.. రోజుకు 10 నిమిషాలే వాడుతున్నారట..!

మొదటి అప్‌డేట్ ఏమిటంటే.. వినియోగదారులు ఇప్పుడు వారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వారి థ్రెడ్స్ ప్రొఫైల్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అందుకు మీరు మీ థ్రెడ్స్ ప్రొఫైల్‌ను సందర్శించి (Settings)కు వెళ్లాలి. ఆపై అకౌంట్‌పై క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ను డిలీట్ చేయండి లేదా ఇన్‌యాక్టివ్ చేయండి. ఆ తర్వాత డిలీట్ ఆప్షన్ ఎంచుకోండి.

Threads account delete from Instagram

ఈ ప్రైవసీ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. :
మరో కొత్త అప్‌డేట్ ప్రకారం.. థ్రెడ్స్ యాప్ బయట ఫీచర్ నిలిపివేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే.. మీరు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. మీ పోస్ట్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెటా ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సస్ చేయలేరని గమనించాలి. ఇటీవలే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో థ్రెడ్స్ పోస్ట్‌లను నేరుగా చూసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలోనే థ్రెడ్స్ యాప్ వెలుపల ఫీచర్ నిలిపివేసేలా ఆప్షన్ తీసుకొచ్చింది. మీ అకౌంట్ సెట్టింగ్‌ (Settings)లో ప్రైవసీ ఆప్షన్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. మెటా బృందం మొత్తం కంటెంట్‌ను హైడ్ చేయడానికి అకౌంట్ ఇన్‌యాక్టివ్ చేయడం ద్వారా ప్రైవేట్‌గా సెట్ చేయడం లేదా వ్యక్తిగత థ్రెడ్స్ డిలీట్ చేయడం ద్వారా యూజర్ ప్రైవసీకి మరింత భద్రత అందిస్తుంది.

Read Also : Threads First Update : మెటా ‘థ్రెడ్స్‘ ఫస్ట్ మేజర్ అప్‌డేట్ ఇదిగో.. ఇక యూజర్లకు పండగే.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త ఫీచర్లు..!