వాట్సప్‌లో బ్లాక్ చేశారా? తెలుసుకోండి ఇలా..!

whatsapp:వాట్సప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్.. ఇప్పుడు నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది.. రోజులో నిద్ర లేవగానే మొదట వాట్సప్ చూసి కార్యకలాపాలు సాగించేవారి శాతం ఎక్కువే. అయితే వాట్సాప్‌లో అనేక విషయాలు మనకు తెలియవు కూడా.. కొన్ని సందేహాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.



వాట్సప్‌లో మనల్ని ఎవరైనా బ్లాక్ చేసిన విషయం తెలుసుకోవాలంటే చాలా కష్టం కదా? అవును నిజమే.. కానీ చిన్న టెక్నిక్ తెలిస్తే మాత్రం అది కష్టం కాదని తెలిసిపోతుంది. వాట్సప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారనే అనుమానం ఉంటే.. తెలుసుకోవాలంటే..

ఓ గ్రూప్ క్రియేట్ చేసి మీరు బ్లాక్ చేశారు అని అనుమానిస్తున్న వ్యక్తిని అందులో ADD చేయండి.. అప్పుడు You are not authorized to add this contact అని మెసేజ్ వస్తుంది అప్పుడు సదరు వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే.. మాములుగా ఎవరైనా వాట్సప్‌లో బ్లాక్ చేస్తే.. వారి స్టేటస్ కనిపించదు. బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకులో కనిపిస్తుంది.



బ్లాక్ చేశారని తెలియక మీరు అతనికి మెసేజ్ పంపితే కేవలం సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కాని అలాగే డబుల్ ట్రిక్ కాని రాదు.. బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని, వాయిస్ మెసేజ్ కాని పంపలేరు.


ట్రెండింగ్ వార్తలు