Google Pay Pocket Money : గూగుల్ పే ‘పాకెట్ మనీ’ ఇదిగో.. ఇకపై ఎవరైనా మీ ఖాతాతో యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.. ఎలాగంటే?

Google Pay Pocket Money : గూగుల్ పే పాకెట్ మనీ ఫీచర్ చూశారా? బ్యాంకు ఖాతా లేని వారు కూడా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. NPCI, UPI సర్కిల్‌పై ఈ ఫీచర్, పిల్లలు, వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. గూగుల్ పే పాకెట్ మనీ ఏంటి? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Pay Pocket Money

  • గూగుల్ పే పాకెట్ మనీతో ఎవరైనా ఈజీగా పేమెంట్ చేయొచ్చు
  • ఈ పాకెట్ మనీ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా?
  • పిల్లలు, వృద్ధులు, స్నేహితులకు మీ ఖాతాపై యూపీఐ పేమెంట్లు

Google Pay Pocket Money : గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ పేమెంట్లు ఎక్కువగా చేస్తుంటే మీకో అద్భుతమైన న్యూస్.. ఇకపై మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీ బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ పేమెంట్లు చేయవచ్చు.

యూపీఐ సర్కిల్ పేరుతో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ యూపీఐ ఖాతాదారులు తమ ఖాతా నుంచి పేమెంట్లను ఆమోదించవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ పేలో పాకెట్ మనీ పేరుతో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఖాతాలు లేని పిల్లలు, వృద్ధులు లేదా స్నేహితులకు ఆన్‌లైన్ పేమెంట్లు చేసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.

గూగుల్ పే పాకెట్ మనీ అనేది ప్రైమరీ యూజర్ బ్యాంక్ ఖాతాతో సెకండరీ యూజర్లు ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అకౌంట్ సేఫ్టీకి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. ఖర్చు పరిమితులను సెట్ చేయవచ్చు. ప్రతి పేమెంట్ ఆమోదించే అవకాశం ఉంటుంది. అవతలి వ్యక్తి చేసిన ప్రతి పేమెంట్ ఆమోదించడం లేదా రిజెక్ట్ చేసే అవకాశం ప్రైమరీ యూజర్ కు ఉంటుంది.

గూగుల్ పే పాకెట్ మనీని ఎలా సెటప్ చేయాలి? :

  • జీపే యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ → యూపీఐ సర్కిల్ → పాకెట్ మనీ సెటప్‌కు వెళ్లండి.
  • మీరు యాడ్ చేయాలనుకునే వ్యక్తి పేరు లేదా నంబర్‌ను ఎంచుకోండి.
  • మీరు యాడ్ చేసే వ్యక్తి యూపీఐ సర్కిల్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
  • మీకు నచ్చిన సెట్టింగ్‌ను ఎంచుకోండి (నెలవారీ లిమిట్ లేదా ప్రతి పేమెంట్ అప్రూవల్).
  • మీ వివరాలను సెకండరీ యూజర్ డేటాలో ఆధార్ నంబరును ఎంటర్ చేయండి.
  • మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఇన్వైట్ చేయండి.

కేవైసీ వెరిఫికేషన్ ఎందుకు అవసరం? :
సేఫ్టీ, ప్రభుత్వ నిబంధనల కారణంగా సెకండరీ యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేయడం తప్పనిసరి. ఇందుకోసం మీరు ఐడెంటిటీ డేటాను అందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జరిగే ఏవైనా మోసపూరిత లావాదేవీలను పసిగట్టడం, రికార్డులను భద్రపరిచే ప్రయోజనాల కోసం బ్యాంకు ఈ సమాచారాన్ని వినియోగిస్తుంది.

జీపేలో ‘పాకెట్ మనీ’ లేదా యూపీఐ సర్కిల్ ఏంటి? :
ప్రైమరీ యూజర్ తమ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన యూపీఐ యాక్సెస్‌ను సెకండరీ యూజర్ ఇచ్చేందుకు ఫీచర్ అనుమతిస్తుంది. సెకండరీ యూజర్ మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఉపయోగించి పేమెంట్లు చేయొచ్చు. కానీ పరిమితులు, కంట్రోలింగ్ పూర్తిగా మీ ఆధీనంలోనే ఉంటాయి.

Read Also : Royal Enfield Flying Flea : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది.. ఏప్రిల్ 10నే లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 154కి.మీ రేంజ్.. ఫుల్ డిటెయిల్స్

ప్రైమరీ, సెకండరీ యూజర్లు ఏంటి? :
ప్రైమరీ యూజర్ గూగుల్ పేలో యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉండి పేమెంట్ చేస్తారు.
సెకండరీ యూజర్ అంటే.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మీ అకౌంట్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయాలనుకునే వ్యక్తి (మీ పిల్లలు లేదా స్నేహితులు). మీరు గరిష్టంగా 5 మంది సెకండరీ యూజర్లను యాడ్ చేయొచ్చు.

గూగుల్ పే పాకెట్ మనీకి రిక్వైర్‌మెంట్స్ ఏంటి? :
రెండో యూజర్ యాడ్ చేసేందుకు అవతలి వ్యక్తి నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసి ఉండాలి. వారి ఫోన్‌లో గూగుల్ పే యాప్ రిజిస్టర్ అయి ఉండాలి. వారికి సొంత యూపీఐ ఐడీ లేదా యూపీఐ సర్కిల్ క్యూఆర్ కోడ్ ఉండాలి.

జీ పేలో పాకెట్ మనీ లిమిట్ ఎంత? :
జీ పే పాకెట్ మనీలో సెకండరీ యూజర్ కోసం నెలవారీ లిమిట్ సెట్ చేయవచ్చు. సెకండరీ యూజర్ నెలకు రూ. 15వేల వరకు లిమిట్ సెట్ చేయవచ్చు. తద్వారా ఇకపై ప్రతిసారి అప్రూవల్ అవసరం లేకుండా పేమెంట్లు చేయొచ్చు.

జీ పే పాకెట్ మనీ పేమెంట్ ఎలా? :
మీరు నెలవారీ పేమెంట్ లిమిట్ సెట్ చేయకపోతే ప్రతి పేమెంట్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతి యూజర్ పేమెంట్ చేసిన ప్రతిసారీ మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. మీ పిన్‌ను ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ పూర్తవుతుంది.