Royal Enfield Flying Flea : రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది.. ఏప్రిల్ 10నే లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 154కి.మీ రేంజ్.. ఫుల్ డిటెయిల్స్
Royal Enfield Flying Flea : రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 లాంచ్‌కు ముందు రేంజ్, హార్డ్‌వేర్ ఫీచర్లతో సహా కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఈ బ్రాండ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో దించుతోంది.
Royal Enfield Flying Flea
- కుర్రాళ్ల డ్రీమ్ బైక్ కొత్త అవతార్ వచ్చేస్తోంది
- రాయల్ ఎన్ ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ తేదీ ఇదే
- సింగిల్ ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు
Royal Enfield Flying Flea : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? యూత్ డ్రీమ్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 కొత్త ఎలక్ట్రిక్ అవతార్ వచ్చేస్తోంది. ఈ కొత్త ఈవీ బైక్ లాంచ్‌కు ముందే రేంజ్, హార్డ్‌వేర్ ఫీచర్లతో సహా కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది.
ఈ బ్రాండ్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇదే. ఈ బైక్ పర్ఫార్మెన్స్ సిటీ రైడర్లను ఆకట్టుకునేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రేంజ్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ :
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సుమారు 150-154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. పట్టణ ప్రయాణాలకు ఈజీగా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4-5 కిలోవాట్-గంటల మధ్య ఉంటుందని అంచనా.
ఇందులో సామర్థ్యం కన్నా టెంపరేచర్ స్టేబిలిటీని అందిస్తుంది. పర్ఫార్మెన్స్ సుమారుగా 125cc–150cc కేటగిరీలోని చిన్న పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో సమానంగా ఉంటుందని అంచనా. ఈ బైక్‌ను హై స్పీడ్ కోసం కాకుండా రోజువారీ వినియోగం కోసం రూపొందించారు.
హార్డ్‌వేర్, ఫీచర్లతో అట్రాక్టివ్ ఆప్షన్లు :
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6లో ఫ్రంట్ సైడ్ గర్డర్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్, అలాగే 2 వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. ఇందులో బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ బైక్ లో-మెయింట్ నెన్స్తో రన్ అవుతుంది.
టెక్నికల్ పరంగా పరిశీలిస్తే.. ఈ మోటార్‌సైకిల్‌లో 5 రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. యాప్ ద్వారా కస్టమ్ రైడ్ సెట్టింగ్‌లను కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ బైక్‌కు ఈ ఎలక్ట్రానిక్ సపోర్ట్ అసాధారణంగా ఎక్కువగా ఉండటం, ఈ కేటగిరీలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ధర (అంచనా) :
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ప్రీమియం కేటగిరీలో వస్తుంది. అయితే, హై పర్ఫార్మెన్స్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీగా మోడ్రాన్ టెక్నాలజీతో సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందించడమే లక్ష్యంగా కంపెనీ చెబుతోంది.
భారతీయ కొనుగోలుదారులు ఇక ఈజీగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోవచ్చు. రోజువారీ వినియోగానికి చాలా బెస్ట్. డిజైన్, ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకుల్లో కొత్త ఫీచర్లు, మరెన్నో స్పెషిఫికేషన్లను అందించనుంది.
