Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు సులభతరం చేస్తోంది. నిర్దిష్ట రోజు నుంచి మెసేజ్‌లను కనుగొనడంలో సాయపడుతుంది. మరింత మంది యూజర్లకు క్రమంగా అందుబాటులో ఉంటుంది.

Whatsapp Search Feature : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్‌ (Whatsapp Web)లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. నిర్దిష్ట తేదీలోపు మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకించి వాట్సాప్ వెబ్ కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ సాయంతో తేదీల వారీగా మెసేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. గతంలో ముఖ్యమైన సమాచారం వంటి నిర్దిష్ట రోజు నుంచి మెసేజ్‌లను కనుగొనడానికి సులభమైన టూల్ అని చెప్పవచ్చు.

Read Also : Unique ID Number : మొబైల్ యూజర్ల కోసం యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది.. ఇక మోసాలకు చెక్ పడినట్టే!

అది ఎలా పని చేస్తుందంటే? :

WABetaInfo రిపోర్టు ప్రకారం.. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, చాట్ సంభాషణలో మెసేజ్ కోసం సెర్చ్ చేసినప్పుడు మీకు కొత్త క్యాలెండర్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా నిర్దిష్ట తేదీలో షేర్ చేసిన మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతించే తేదీ పికర్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ప్రారంభంలో, ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ అధికారిక బీటా ప్రోగ్రామ్‌లో చేరిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ రెగ్యులర్ యూజర్ల కోసం ఇంకా ఫీచర్ టెస్టింగ్ చేయాల్సి ఉంది.

WhatsApp date-message search feature  

తేదీ ద్వారా మెసేజ్ సెర్చ్‌‌తో కలిగే ప్రయోజనాలివే :

ఈ ఫీచర్ అనేక బెనిఫిట్స్‌తో వస్తుంది. గత చాట్ సంభాషణల నుంచి నిర్దిష్ట మెసేజ్‌లను కనుగొనే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అదే సమయాన్ని సేవ్ చేస్తుంది. సుదీర్ఘ చాట్ హిస్టరీల ద్వారా స్క్రోలింగ్ నిరాశను తగ్గిస్తుంది. వాయిస్ నోట్స్ వంటి టెక్స్ట్-యేతర మెసేజ్‌లను తిరిగి పొందడానికి ప్రత్యేకంగా అందిస్తోంది. టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్‌లు లేని కారణంగా కనుగొనడం సవాలుగా మారింది. అదనంగా, మీరు టెక్స్ట్ మెసేజ్ కచ్చితమైన పదాలను గుర్తుంచుకోలేనప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు వాట్సాప్ వెబ్ లేటెస్ట్ వెర్షన్‌ని ఉపయోగించే బీటా టెస్టర్ అయితే.. ఇప్పటికే ఈ ఫీచర్‌కి యాక్సెస్ చేసుకోవచ్చు. మరికొందరికి రానున్న రోజుల్లో క్రమంగా ఫీచర్ అందుబాటులోకి రానుంది. మరోవైపు.. వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. వాట్సాప్‌లో వారి ఇమెయిల్ అడ్రస్ ఆప్షన్ యాడ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం తర్వలో రిలీజ్ కానుంది.

Read Also : Galaxy Smartphones : గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లలో ఓటీపీ మెసేజ్‌లను ఆటో డిలీట్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

ట్రెండింగ్ వార్తలు