వాట్సాప్ Groupలో సరికొత్త ఫీచర్.. Messages అదే డిలీట్ చేస్తుంది!

  • Publish Date - December 27, 2019 / 08:28 AM IST

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది యూజర్లను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Disappearing Messages ఫీచర్.. దీన్ని Delete Messeages పేరుతో Update చేసింది వాట్సాప్. ఎప్పటినుంచో దీనిపై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోందని గత అక్టోబర్ నెలలోనే రుమార్లు వినిపించాయి. కానీ, ఇప్పటివరకూ ఈ ఫంక్షన్ ఫీచర్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు.

వాట్సాప్ Chat బాక్సులో మెసేజ్‌లను ఆటో డిలీట్ చేసే ఫీచర్.. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో మరోసారి కనిపించింది. లేటెస్ట్ బీటా వెర్షన్ 2.19.275లో ఈ ఫీచర్ వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా వర్క్ చేస్తుందో తెలుసా? మీ వాట్సాప్ ప్రైవేట్ చాట్ లేదా గ్రూపు చాట్ బాక్సులో మెసేజ్ లను దానింతంట అదే డిలీట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్ బాక్సులో మెసేజ్ లు ఎన్నిరోజులు ఉండాలో సెట్ చేసుకోవచ్చు.

సెట్ చేసిన టైమ్ బట్టి ఆటోమాటిక్ గా చాట్ బాక్సులోని మెసేజ్ లన్నీ డిలీట్ అయిపోతాయి. అదేలా.. అనుకుంటున్నారా? ఏం లేదు.. నిర్దిష్ట సమయాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. మీరు సెట్ చేసినా సమయానిబట్టి ఆటోమాటిక్ గా ఆయా మెసేజ్ లన్నీ డిలీట్ అయిపోతాయి. WABetaInfo ప్రకారం.. డిలీట్ మెసేజస్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఓసారి పరిశీలిద్దాం..

ఎలా పనిచేస్తుంది? బెనిఫిట్స్ ఏంటి? :
* Contact Info లేదా Group Settingsలో Delete Messages ఫీచర్ ఉంటుంది.
* ఈ ఫీచర్.. గ్రూపు మెసేజ్ లన్నింటిని ఒకేసారి డిలీట్ చేస్తుంది.
* స్మార్ట్ ఫోన్ స్టోరేజీలో మెసేజ్‌లు పెరిగిపోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది.
* అనవసరమైన మెసేజ్ లన్నింటిని డిలీట్ చేసుకునేందుకు వీలుంది.
* మొబైల్ ఇంటర్నల్ స్టోరేజీ Full అయిపోయిందనే ఆందోళన అక్కర్లేదు.
* డేటా ప్రైవసీ విషయంలో కూడా ఎలాంటి భయం పడాల్సిన అవసరం ఉండదు.

Admin యూజర్లు మాత్రమే :
గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.275 Download చేసుకుని Install చేసుకోవచ్చు. లేదంటే APK మిర్రర్ నుంచి కూడా ఈ వెర్షన్ వాట్సాప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Admin యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ Enable చేసేందుకు అనుమతి ఉంటుంది. గ్రూపులోని సభ్యులందరికి Delete message ఫీచర్ సెట్టింగ్ అప్లయ్ అవుతుంది

Time సెట్ చేయండిలా :
లేటెస్ట్ బీటా వెర్షన్‌లో గ్రూపు చాట్ బాక్సులో మెసేజ్‌లను ఎన్నిరోజులు, నెల, ఏడాది ఇలా ఎంత సమయం వరకు ఉండాలో పరిమిత సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమాటిక్ గా చాట్ బాక్సు నుంచి మెసేజ్ లు డిలీట్ అయిపోతాయి. ఇందులో One Hour, One Day, One Week, One Month, One Year ఇలా ఏదొకటి సెట్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు