WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. మీ చాట్ బాక్సు ఫిల్టర్ చేసేస్తుంది..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ మరో కొత్త ఫీచర్ యాడ్ చేయనుంది.

WhatsApp Advanced Search feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ మరో కొత్త ఫీచర్ యాడ్ చేయనుంది. అదే.. వాట్సాప్ అడ్వాన్సడ్ సెర్చ్ (WhatsApp Advanced Search Feature) ఫీచర్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. బిజినెస్ అకౌంట్ యూజర్లకు మాత్రమే.. ఈ ఫీచర్ ద్వారా బిజినెస్ అకౌంట్ యూజర్లు సులభంగా చాట్ బాక్సులో సెర్చ్ చేసుకోవచ్చు.

ఎక్కువ కాంటాక్టు లిస్టు కలిగిన వాట్సాప్ యూజర్లకు ఈ అడ్వాన్సడ్ సెర్చ్ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో కాంటాక్టులతో పాటు నాన్ కాంటాక్టులు, అన్ రీడ్ మెసేజ్ లను కూడా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందరికి అందుబాటులోకి రానుంది. అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా చాట్ బాక్సులో మెసేజ్‌లను ఫిల్టర్ చేసుకోవచ్చు.  అడ్వాన్సడ్ సెర్చ్ ఫీల్టర్ ద్వారా యూజర్లు సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో ఈ ఫీచర్ Enable చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెర్చ్ ఫిల్టర్ బాక్సులో కాంటాక్ట్స్, నాన్-కాంటాక్ట్స్, అన్ రీడ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. మీ చాట్ బాక్సులోని ఫొటోలు, వీడియోలు, లింకులు, జిఫ్ ఇమేజెస్, ఆడియోలు, డాక్యుమెంట్లను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లోని ఈ ఆప్షన్ల ద్వారా త్వరగా సెర్చ్ రిజల్ట్స్ పొందవచ్చు. నాన్ కాంటాక్టులు పంపిన ఫొటోలను కూడా ఈ ఫీచర్ సాయంతో సెర్చ్ చేసుకోవచ్చు.

Read Also : ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

ట్రెండింగ్ వార్తలు