ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

ఇక ముందు క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. కార్డు ఉపయోగించి నగదు విత్ డ్రా చేయడం, బిల్లు చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే జేబుకి భారీ..

ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

Icici Credit Card

ICICI Credit Card : మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఇక ముందు క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. కార్డు ఉపయోగించి నగదు విత్ డ్రా చేయడం, బిల్లు చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే జేబుకి భారీ చిల్లు పడటం ఖాయం.

మ్యాటర్ ఏంటంటే.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఛార్జీలు పెరిగాయి. క్రెడిట్ కార్డుతో క్యాష్ అడ్వాన్స్ గా తీసుకున్నా (కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు తీసినా) లేక లేటుగా బిల్ పే చేసినా వినియోగదారులపై భారీ భారం పడనుంది. అడ్వాన్స్ మొత్తంలో 2.5శాతం లేదా కనీసం రూ.500 చొప్పున వసూలు చేయనున్నారు.

Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ కొత్త 5G ఫోన్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే.. బిల్లు మొత్తం రూ.100లోపు ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.100-500 మధ్య రూ.100, రూ.501-5000 మధ్య రూ.500.. కట్టాల్సి ఉంటుంది. రూ.5001- 10వేలు అయితే రూ.750, రూ.10001-25వేల వరకు రూ.900, రూ.25,001 నుంచి రూ.50వేల వరకు రూ.1000, రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలన్నింటికీ రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది.

అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఆలస్యంగా చెల్లింపులు చేయడం, ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు డ్రా చేయడం వంటివి చేసే వారికి మాత్రం ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ భారం పడకూడదనుకుంటే.. క్రెడిట్‌ కార్డు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాదు నిర్దేశించిన గడువులోగా బిల్ పే చేయాల్సిందే.

Ponnaganti Leaves : పోషక విలువల పొన్నగంటి

అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్‌ కార్డు ఛార్జీల సవరణకు సంబంధించి ఇప్పటికే తన వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంకు సందేశాలు పంపిస్తోంది.