Ponnaganti Leaves : పోషక విలువల పొన్నగంటి

జుట్టుకు పోషణనిచ్చు బయోటిన్ ఇందులో ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసుకోవచ్చు.

Ponnaganti Leaves : పోషక విలువల పొన్నగంటి

Ponnaganti

Ponnaganti Leaves : ఆకు కూరల్లో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు కలిగినది పొన్నగంటి ఆకు. అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. పొన్నగంటి కూర ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లతోపాటు విటమిన్ ఎ, బి6, సి, ఫొలేట్, రైబోఫ్లెవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరకుతాయి.

పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆకుకూరను తీసుకోవటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. అధిక శరీర వేడి, తలనొప్పికి తగ్గటానికి పొన్నగంటి ఆకుల నుండి తయారైన తైలం ఉపయోగిస్తారు. ఇది శీతలీకరణ ప్రభావం కలిగి ఉండటంతో వంట్లో వేడికి మంచి ఉపశమనం లభిస్తుంది.

నలభై ఎనిమిది రోజులు పాటు పొన్నగంటి ఆకుల కూర తింటే, శరీరానికి అవసరమైన ఖనిజాలు, పోషకాలు అధిక మోతాదులో అందుతాయి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో బాగా సహాయపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

ఇది కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. కళ్లను సంరక్షించుకోవచ్చు. ఆయుర్వేద ఔషధంలో అనేక రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారు పొన్నగంటి కూర తినటం ఉత్తమం.

డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు ఈ కూరను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పొన్నగంటి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. దీంతో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. అధిక బరువు తగ్గాలనుకునేవారికి పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది.

జుట్టుకు పోషణనిచ్చు బయోటిన్ ఇందులో ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసుకోవచ్చు. చర్మం, ఎముకలు తదితర క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడుతుంది. పొన్నగంటి కూరను రోజూ తింటుంటే.. వీర్య కణాల్లో ఉండే లోపం తగ్గుతుంది. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. దీంతోపాటు వీర్యం ఎక్కువగా తయారవుతుంది. దీని వల్ల పురుషులకు సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.

బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. మధుమేహుల్లో పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే మొలలు సమస్య తగ్గిపోతుంది.