Whatsapp Accounts Ban : భారత్‌లో 7.11 మిలియన్లకు పైగా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Whatsapp Accounts Ban : సెప్టెంబర్ 2023లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో 7.11 మిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది.

WhatsApp banned over 71 lakh accounts in India in September, Here is why

Whatsapp Accounts Ban : భారత్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్‌లో 7.11 మిలియన్ అకౌంట్లను నిషేధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. దేశానికి సంబంధించిన అత్యంత ఇటీవలి నెలవారీ రిపోర్టును ప్రకటించింది. ఈ వాట్సాప్ అకౌంట్లలో 2.57 మిలియన్లు ఎలాంటి యూజర్ రిపోర్టులు స్వీకరించకుండానే ముందస్తుగా నిషేధించినట్టు తెలిపింది.

భారతీయ యూజర్లు లేవనెత్తిన ఆందోళనలు, దేశీయ అకౌంట్లు ఉల్లంఘనలు, గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC) ఆదేశాలకు ప్రతిస్పందనగా వాట్సాప్ తీసుకున్న చర్యలను నివేదిక వివరిస్తుంది. ఈ చర్యలు యూజర్ ఫిర్యాదులు, చట్టపరమైన ఉల్లంఘనలు సహా పలు రకాల ఆందోళనలపై ఆధారపడి ఉన్నాయి.

సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య వాట్సాప్ మొత్తం 7,111,000 అకౌంట్లను నిషేధించిందని నివేదిక సూచిస్తుంది. ఇందులో 2,571,000 అకౌంట్లు ఏదైనా యూజర్ రిపోర్టులను స్వీకరించడానికి ముందు ముందస్తుగా బ్యాన్ అయ్యాయి. అకౌంట్ సపోర్టు (1,031), బ్యాన్ అప్పీళ్లు (7,396), ఇతర సపోర్టు కేటగిరీలు (1,518), ప్రొడక్టు సపోర్టు (370), సెక్యూరిటీ (127)తో సహా సెప్టెంబరులో వివిధ కేటగిరీలో 10,442 యూజర్ రిపోర్టులు అందిన తర్వాత ఈ చర్య తీసుకుంది.

Read Also : Whatsapp Video Controls : యూట్యూబ్‌లోనే కాదు భయ్యా.. వాట్సాప్‌లోనూ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్..!

85 అకౌంట్లు తమకు వచ్చిన రిపోర్టుల ఆధారంగా బ్యాన్ చేసినట్టు నివేదిక పేర్కొంది. భద్రతా సమస్యలు ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగం లేదా హానికరమైన ప్రవర్తనను కలిగి ఉంటాయని, స్వీకరించిన అన్ని ఫిర్యాదులను వాట్సాప్ అడ్రస్ లేదా మునుపటి ఫిర్యాదులు ఫేక్ అయినట్టయితే వాటిపై చర్యలు తీసుకుంటాయని నివేదిక వివరిస్తుంది. అకౌంట్స్ యాక్షన్ అనే రిపోర్టును సూచిస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది.

వాట్సాప్‌లో స్కామ్ ఆఫర్లు :
ఫేక్ జాబ్ ఆఫర్‌లు : స్కామర్‌లు మీకు అధిక వేతనంతో ఉద్యోగాన్ని అందించవచ్చు. కానీ, సాధారణంగా రుసుము చెల్లించమని లేదా వ్యక్తిగత సమాచారాన్ని ముందుగా అందించమని అడుగుతారు. వారిలో వలలో పడకండి.

WhatsApp ban accounts in India

అనుమానాస్పద బహుమతులు : మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడానికి బదులుగా ఫ్రీ ఐఫోన్ లేదా ఇతర గిఫ్ట్ ఇస్తామంటూ వచ్చే మెసేజ్‌లను మీరు చూసినట్లయితే ఏ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఈ స్కామ్‌లు మీ డేటాను దొంగిలిస్తాయని జాగ్రత్త.

అనుమానాస్పద యాప్‌లు : అనుమానిత యాప్‌లను మీ ఫోన్లలో డౌన్‌లోడ్ చేయవద్దు. ప్రత్యేకించి బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ నుంచి వచ్చినట్టుగా ఉంటే.. స్కామర్‌లు మీ ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసేలా మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నించవచ్చు.

విదేశీ కాల్స్ : గుర్తుతెలియని విదేశీ నంబర్‌ల నుంచి వచ్చిన అన్ని కాల్‌లను రిజక్ట్ చేసి బ్లాక్ చేయండి. వాట్సాప్ ఈ కాల్‌లను నివారించేందుకు చర్యలు తీసుకుంటుంది. కానీ, మీరు ఇలాంటి కాల్స్ వస్తే అసలు వాటికి సమాధానం ఇవ్వవద్దు.

ర్యాండమ్ లింక్స్ : వాట్సాప్ మెసేజ్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఈ లింక్‌లను క్లిక్ చేయొద్దు. లేదంటే.. మీ డివైజ్ ఫిషింగ్ వెబ్‌సైట్‌లు లేదా మాల్వేర్‌లకు రీడైరెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

వాట్సాప్ అకౌంట్లను ఎలా రిపోర్టు చేయాలంటే? :
* మీరు రిపోర్టు చేయాలనుకునే వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేయండి.
* చాట్ ఎగువన ఉన్న వ్యక్తి పేరును నొక్కండి.
* ‘Report’ నొక్కండి.
* మీరు అకౌంట్ ఎందుకు రిపోర్టు చేస్తున్నారో కారణాన్ని ఎంచుకోండి.
* ‘Send’ నొక్కండి.

Read Also : OnePlus Diwali Offers : వన్‌ప్లస్ దీపావళి సేల్.. ఈ రెండు ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు.. పండుగ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు!