Apple iPhone : అశ్లీల కంటెంట్‌‌కు చెక్ పెట్టేందుకు యాపిల్ చర్యలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాట్సాప్

అశ్లీల కంటెంట్ కు చెక్ పెట్టేందుకు...‘యాపిల్’ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ నిర్ణయం యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేందిగా ఉందన్న చర్చ నడుస్తోంది.

Apple Iphone

WhatsApp CEO : అశ్లీల కంటెంట్ పెరిగిపోతోంది. సోషల్ మీడియా యాప్‌‌లలో ఇలాంటి రకమైన కంటెంట్ వస్తుండడం కలకలం రేపుతోంది. వాట్సాప్ లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండడం..రిపోర్టింగ్ ద్వారా సదరు యూజర్ అకౌంట్, గ్రూపుల మీద చర్యలు తీసుకొంటోంది వాట్సాప్. ఇలాంటి కంటెంట్ కు చెక్ పెట్టేందుకు…‘యాపిల్’ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ నిర్ణయం యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేందిగా ఉందన్న చర్చ నడుస్తోంది.

Read More : Neeraj Chopra: What is the favorite food of gold medalist Neeraj Chopra?

ఫొటో ఐడెంటిఫికేషన్ ఫీచర్ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయాలని..తద్వారా వాట్సాప్ ఫొటోలను స్కాన్ చేసి ఆటోమెటిక్ గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్ సంస్థ చర్యలు చేపట్టింది. అయితే..ఈ నిర్ణయంపై వాట్సాప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Read More : Corona Update: Slightly increased corona cases in the country

యాపిల్ కంపెనీ సంస్థపై వాట్సాప్ హెడ్ విల్ క్యాథ్ కార్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్లీలత కంటెంట్ గుర్తింపు చేయడం..వాటిని కట్టడి చేయడంలాంటి చర్యలు యాపిల్ సంస్థ తీసుకోవడం అభినందనీయమే కానీ…ఫొటో ఐడెంటిఫికేషన్ సాఫ్ట్ వేర్ అనేది యూజర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

Read More : ISRO: Preparations for the launch of ‘GSLV F10’ are in full swing.

ఫోన్ లో ఉన్న వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్ చేసే ప్రమాదం ఉందని, భద్రతాపరంగా కాకుండా యూజర్ పై నిఘా వ్యవస్థలా పని చేస్తుందన్నారు. ఇలాంటి టూల్స్ ను వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదని స్పష్టం చేశారు. యాపిల్ సంస్థ చేస్తున్న విమర్శలపై సైబర్ నిపుణులు కొంతమంది ఏకీభవిస్తున్నట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ ద్వారా ఫోన్, డివైజ్ లను స్కాన్ చేయడం సరైంది కాదంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయో చూడాలి.