WhatsApp Hacking Scam : వాట్సాప్ హ్యాకింగ్ స్కామ్‌తో జాగ్రత్త.. స్కామర్ల నుంచి మీ అకౌంట్లు ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

WhatsApp hacking Scam : గత కొన్ని నెలలుగా దేశంలో ఆన్‌లైన్ స్కామ్ కేసులు పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను ఆకర్షించడానికి వారి నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

WhatsApp hacking Scam _ Here is how you can keep your account safe from scammers

WhatsApp hacking Scam : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఇటీవల, కోల్‌కతా పోలీస్ సైబర్ సెల్ కొత్త రకమైన స్కామ్ గురించి హెచ్చరిక జారీ చేసింది. ఈ స్కామ్‌లో స్కామర్లు డబ్బును దొంగిలించేందుకు Facebook, WhatsApp అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. నగరంలో విద్యార్థి, వ్యాపారవేత్త నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా వాట్సాప్, ఫేస్‌బుక్ యూజర్లకు ఈ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఫిర్యాదుల్లో (Facebook) ప్రొఫైల్ మాదిరిగా కనిపించే సైబర్ మోసానికి సంబంధించినవి. బాధితుల ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లకు హ్యాకర్లు అనధికారిక యాక్సెస్‌ను పొందుతున్నారు. యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్‌లు మెసెంజర్ ద్వారా బాధితుల స్నేహితుల వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు.

వాట్సాప్‌ను స్కామర్లు ఎలా హ్యాక్ చేస్తారంటే? :
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం (World Yoga Day) సందర్భంగా యోగా తరగతుల నెపంతో స్కామర్లు చాలా మంది వ్యక్తులను సంప్రదించినప్పుడు నివేదించిన సంఘటనలు మొదట వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం.. స్కామర్లు వ్యక్తులను సంప్రదించి యోగా తరగతుల్లో చేరమని ఆహ్వానించారు. అందుకు బాధితులు ఒక లింక్‌ను పంపారు. దానిపై క్లిక్ చేయమని వారిని కోరారు. క్లిక్ చేసిన తర్వాత 6 అంకెల OTP కోడ్‌ను షేర్ చేయమని అడిగారు. అది తెలియక, బాధితులు వాట్సాప్ వెరిఫికేషన్ కోసం OTP కోడ్‌ను షేర్ చేశారు.

Read Also : Twitter X Logo : ట్విట్టర్ కొత్త లోగోను 2 సార్లు మార్చిన ఎలన్ మస్క్.. X లోగోలో అది నచ్చలేదట..!

బాధితులు కోడ్‌ను షేర్ చేసిన వెంటనే స్కామర్‌లు తమ వాట్సాప్ అకౌంట్లను యాక్సెస్ పొందుతారు. స్కామర్‌లు హ్యాక్ చేసిన వాట్సాప్ అకౌంట్లపై కంట్రోల్ సాధించిన తర్వాత వారు బాధితుల గుర్తింపును పొంది వారి కాంటాక్టుల నుంచి డబ్బును అభ్యర్థించడం ప్రారంభిస్తారు. ఈ అభ్యర్థనలు తరచుగా ఎమర్జెన్సీ నెపంతో ఉంటాయి. త్వరలో తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మిస్తారు. ఈ కేసు కూడా ’Hello Mom’ కుంభకోణం లాంటిదే.. ఇది చాలా దేశాల్లో నమోదైంది. కొన్ని సందర్భాల్లో నేరస్థులు తమ వాట్సాప్ అకౌంట్లకు యాక్సస్ తిరిగి పొందేందుకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి బాధితులను బలవంతపెడుతుంటారు.

వాట్సాప్ హ్యాకింగ్ స్కామ్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
వాట్సాప్ హ్యాకింగ్ స్కామ్‌ను పరిష్కరించడానికి కోల్‌కతా పోలీసులు వాట్సాప్ కోడ్‌లను షేరింగ్ చేయమని అభ్యర్థించే తెలిసిన కాంటాక్టుల నుంచి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని నెటిజన్లను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని, వారి కాంటాక్టుల నుంచి కూడా ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు వినియోగదారులకు సూచిస్తున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ స్కామ్‌ల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ కింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.

WhatsApp hacking Scam _ Here is how you can keep your account safe from scammers

అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి : ముఖ్యంగా తెలిసిన కాంటాక్టుల నుంచి WhatsApp కోడ్‌లను షేర్ చేయమని మిమ్మల్ని అభ్యర్థించే మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.

అయా మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం మానుకోండి : మీకు వాట్సాప్ కోడ్స్ లేదా సున్నితమైన డేటా కోసం ఏవైనా మెసేజ్‌లు వచ్చినట్లయితే వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దు.

కాంటాక్టులతో అభ్యర్థనలను ధృవీకరించండి : మీ వాట్సాప్ కాంటాక్టుల లిస్టు నుంచి ఎవరైనా ప్రైవసీ డేటా లేదా కోడ్‌లను అడిగితే మీకు తెలిసినప్పటికీ, ఫోన్ కాల్ లేదా వ్యక్తిగత సంభాషణ వంటి ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా అభ్యర్థనను ధృవీకరించాలి.

టూ-ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి : వాట్సాప్ మీ అకౌంట్ అడ్వాన్సడ్ సెక్యూరిటీని యాడ్ చేసే టూ-ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ ఫీచర్‌ను అందిస్తుంది. Whatsapp Settings > Account > Two-step verification ద్వారా ఆప్షన్ ఎనేబుల్ చేయండి. దీనికి మీరు సెటప్ చేసిన పిన్ అవసరమని గమనించాలి. వాట్సాప్ అకౌంట్లో మీ ఫోన్ నంబర్‌ను మళ్లీ ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది.

అనుమానాస్పద కార్యకలాపాలను రిపోర్టు చేయండి : మీరు వాట్సాప్‌లో ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, అకౌంట్లు లేదా కార్యకలాపాలను చూసినట్లయితే.. వాట్సాప్ లేదా మీ లోకల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు రిపోర్టు చేయండి.

Read Also : Infinix GT Pro Launch : రూ. 20వేల లోపు ధరలో గేమింగ్ కంట్రోల్‌తో ఇన్ఫినిక్స్ GT ప్రో ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు