WhatsApp new disappearing messages option : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. disappearing messages ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ చాట్ బాక్సులోని మెసేజ్‌లను ఆటో డిలీట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లో ఆటో డిలీట్ ఆప్షన్ Enable చేయడం ద్వారా ఏడు రోజుల తర్వాత ఆటో డిలీట్ అయిపోతాయి. వాట్సాప్ వ్యక్తిగత చాట్ బాక్సు, గ్రూపు అడ్మిన్లకు చాట్ బాక్సుల్లో కూడా ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ మెసేజ్‌లతో నిండిపోయిన చాట్ బాక్సును ఎప్పటికప్పుడూ క్లియర్ చేసుకోవాలంటే ఈ ఆటో డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.. సరిగ్గా ఏడు రోజుల తర్వాత పాత మెసేజ్‌లు చాట్ బాక్సులో నుంచి అదృశ్యమైపోతాయి.
ఇందులో టెక్స్ట్ మాత్రమే కాదు.. ఫొటోలు, వీడియోలు కూడా ఆటో డిలీట్ అయిపోతాయి. వాట్సాప్ మెసేజ్ లు పంపినవారితో పాటు రిసీవ్ చేసుకున్నవారి చాట్ బాక్సులో కూడా సంబంధిత మెసేజ్ లు అదృశ్యమైపోతాయి.
https://10tv.in/whatsapp-is-bringing-video-voice-calling-features-for-desktop/
ఇంతకీ ఈ disappearing messages ఆప్షన్ ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు.. గ్రూపు లేదా కాంటాక్ట్ బేసిస్ వద్ద (ON / OFF) ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేశాక.. వాట్సాప్ ఫ్రెండ్స్ చాట్ బాక్సులోని ప్రతి కాంటాక్ట్ సెక్షన్ లో ఈ కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు.
గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పాత వాట్సాప్ మెసేజ్ లు డిలీట్ కావు.. ఆటో డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత వచ్చిన కొత్త మెసేజ్ లు మాత్రమే ఆటో డిలీట్ అవుతాయి. ఈ నవంబర్ నెలలోనే disappearing messages ఫీచర్ అందుబాటులోకి రానుంది.