Whatsapp Metro Tickets _ Now you can book metro tickets through WhatsApp but only in Chennai
Whatsapp Metro Tickets Booking : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ద్వారా మెట్రో టిక్కెట్ల (Metro Tickets)ను బుక్ చేసుకోవచ్చు. కానీ, చెన్నైలో మాత్రమే వాట్సాప్ చాట్‌బాట్ సాయంతో ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మెట్రో ప్రయాణికులు లాంగ్ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించి నిమిషాల వ్యవధిలో మొత్తం టికెటింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీరు మెట్రో స్టేషన్ల వెలుపల లాంగ్ క్యూలో నిలబడకూడదని భావిస్తే.. మీరు చెన్నైలో తప్పక ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పుడు వాట్సాప్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.
Read Also : IPL 2023: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు.. సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు.. చిక్కుల్లో చెన్నై..!
చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (CMRL) చెన్నై మెట్రో ప్రయాణికుల కోసం టిక్కెట్ల ప్రక్రియను మెరుగుపరచడానికి కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. (Tanla) సొల్యూషన్స్ అనుబంధ సంస్థ (Karix) సహకారంతో WhatsApp చాట్‌బాట్ ఆధారిత QR టికెటింగ్ సర్వీసును ప్రారంభించారు. ఈ సర్వీసులో చెన్నైలోని ప్రజలకు రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ చాట్‌బాట్ సాయంతో ప్రయాణికులు ఇకపై తమ టిక్కెట్లను బుక్ చేసేందుకు లాంగ్ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా తమ వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించి నిమిషాల వ్యవధిలో మొత్తం టికెటింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
చాట్‌బాట్ యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. మెట్రో ప్రయాణికులు ఇంగ్లీష్, తమిళం రెండు భాషల్లో వినియోగించుకోవచ్చు. WhatsApp, CMRC మధ్య భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. మెటా (Meta) ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ మాట్లాడుతూ.. ‘వాట్సాప్ సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్, మల్టీ లాంగ్వేజ్ సామర్థ్యాలు రోజువారీ రవాణా వంటి యుటిలిటీ సర్వీసులకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ వాట్సాప్ చాట్‌బాట్‌ను నిర్మించడంలో చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్‌కు సపోర్టు అందించినందుకు సంతోషిస్తున్నాం. చెన్నై మెట్రో ప్రయాణికులకు వారి రోజువారీ ప్రయాణంలో సౌకర్యవంతంగా అందించవచ్చు’ అని పేర్కొన్నారు.
వాట్సాప్‌లో టిక్కెట్లను ఇలా బుక్ చేసుకోవచ్చు :
వాట్సాప్ సర్వీసును యాక్సెస్ చేసేందుకు మెట్రో ప్రయాణికులు ఫోన్ నంబర్ +91 83000 86000కి ‘Hi’ అని మెసేజ్ పంపవచ్చు. అప్పుడు QR కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. కనెక్ట్ అయ్యాక చాట్‌బాట్ అందించే వివిధ రకాల సర్వీసులకు యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ సర్వీసుల్లో టిక్కెట్లు బుకింగ్, ఛార్జీలు, రూట్ వివరాలను చెక్ చేయొచ్చు. మెట్రో రైలు ప్రారంభం నుంచి గమ్యస్థాన స్టేషన్‌లను ఎంచుకోవడం వంటి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి. వాట్సాప్ చాట్‌బాట్ ఆధారిత QR టికెటింగ్ సర్వీసుతో చెన్నై మెట్రో ప్రయాణికులకు టిక్కెట్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడం, టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.