Realme Narzo N53 : రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Realme Narzo N53 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

Realme Narzo N53 : రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Realme Narzo N53 launched in India under Rs 10,000_ check price, specs, and more details

Realme Narzo N53 launched in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను (Narzo) సిరీస్‌లో రిలీజ్ చేసింది. రియల్‌మి నుంచి (Realme Narzo N53) ఫోన్ స్లిమ్మెస్ట్ నార్జో ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ రూ 8999 ప్రారంభ ధరతో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి ఈరోజు భారత మార్కెట్లో కొత్త రియల్‌మి Narzo N53ని లాంచ్ చేసింది. నార్జో N-సిరీస్ కింద కేవలం రెండు నెలల్లో ఇది రెండవ ఫోన్.. కేవలం రూ. 10,999 ప్రారంభ ధరతో వచ్చిన నార్జో N55 మొదటిది నార్జో సిరీస్‌లో నార్జో N53 కంపెనీ ‘స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్’ అని రియల్‌మి పేర్కొంది.

ఈ ఫోన్ స్టైలిష్ గోల్డ్ ఫిలమెంట్ కోటింగ్, కాలిఫోర్నియా సన్‌షైన్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. కొత్త Narzo N53 బ్యాటరీ పనితీరుపై అదనపు ఫోకస్‌తో మనీ-ఫర్-మనీ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh, 50-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. రియల్‌మి Narzo N53 ప్రారంభ ధర రూ. 8,999 వద్ద 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది.

Read Also : iPhone 12 mini Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. రూ.20,999లకే సొంతం చేసుకోండి.. అద్భుతమైన ఆఫర్.. డోంట్ మిస్..!

రియల్‌మి Narzo N53 ధర ఎంతంటే? :
రియల్‌మి ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో (Realme Narzo N53)ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.8999తో మొదలై రూ.10,999 వరకు ఉంటుంది. ఈ ఫోన్ ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Realme Narzo N53 launched in India under Rs 10,000_ check price, specs, and more details

Realme Narzo N53 launched in India under Rs 10,000_ check price, specs, and more details

రియల్‌మి Narzo N53 మొదటిసారిగా మే 24న మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకంగా Amazon, realme.comలో అమ్మకానికి రానుంది. అంతేకాదు.. రియల్‌మి ఒక స్పెషల్ సేల్ కూడా షెడ్యూల్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు అధికారిక సేల్ తేదీకి ముందే కొత్త Narzo N53ని పొందవచ్చు. స్పెషల్ సేల్ మే 22కి సెట్ చేసింది. ఈ స్పెషల్ సేల్ నిర్ణీత తేదీన మధ్యాహ్నం 2-4 గంటల మధ్య 2 గంటల పాటు అందుబాటులో ఉంటుందని గమనించాలి.

రియల్‌మి Narzo N53 స్పెసిఫికేషన్‌లు ఇవే :
రియల్‌మి నార్జో N53 ఫోన్ 90Hz గరిష్ట రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 90.3 శాతం, టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T612 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 182g బరువు ఉంటుంది. నార్జో N53 బ్యాక్ 50-MP వెనుక కెమెరా సెటప్, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కోసం 8-MP కెమెరాను కలిగి ఉంది. హుడ్ కింద, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

6GB RAM + 128GB ROM వరకు అందుబాటులో ఉన్న స్టోరేజీ ఆప్షన్లు 6GB వరకు విస్తరించే RAM ఆప్షన్, 2TB వరకు ఎక్స్‌ట్రనల్ మెమరీ సపోర్టుతో 4G ఎనేబుల్ అయి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అదనంగా, రియల్‌మి Narzo N53లో మినీ క్యాప్సూల్, 150 శాతం అల్ట్రా బూమ్ స్పీకర్, సులభంగా అన్‌లాక్ చేసేలా సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే నార్జో N53 ఫోన్ సొంతం చేసుకోండి.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!