WhatsApp might soon allow you to pin messages within chats and groups
WhatsApp Pin Messages : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వాట్సాప్ యూజర్ల గ్రూప్‌ల నుంచి చాట్‌లలోని మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుందని నివేదిక సూచిస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. రాబోయే ఫీచర్ వాట్సాప్ యూజర్ల గ్రూప్‌ల నుంచి లేదా పర్సనల్ చాట్‌ల నుంచి చాట్‌లో పైభాగంలో ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని రిలీజ్ చేసిన తర్వాత యూజర్‌లు మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. వాట్సాప్ పాత వెర్షన్‌ని ఉపయోగిస్తే.. ప్లే స్టోర్ నుంచి యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పిన్ చేసిన మెసేజ్‌లు గ్రూప్‌లలో ఆర్గనైజ్డ్ చాట్‌లను మెరుగుపరచడంలో సాయపడతాయి. ఎందుకంటే.. వినియోగదారులు తమ ముఖ్యమైన చాట్‌లను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతానికి, చాట్‌లు, గ్రూప్‌లలో మెసేజ్‌లను పిన్ చేసే ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కూడా కొత్త ఫీచర్‌పై పని చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు సులభంగా కాల్‌లు చేసేందుకు సాయపడుతుందని నివేదిక సూచిస్తుంది. ఈ ఫీచర్ యాప్‌ని ఉపయోగించి కాల్స్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
WhatsApp might soon allow you to pin messages within chats and groups
Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు..!
రాబోయే ఈ కొత్త ఫీచర్ యూజర్లను వారి కాంటాక్టుల లిస్టును త్వరగా యాక్సెస్ చేసేందుకు అప్లికేషన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్‌లు చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపింది. వాట్పాప్ కాంటాక్టుల కోసం కస్టమైజడ్ షార్ట్‌కట్‌లను సెటప్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. దీంతో యూజర్లు త్వరగా కాల్స్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కాల్‌లను మెసేజ్‌లు పంపినంత సులువుగా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. అప్లికేషన్‌తో కలిపి వాట్సాప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ కాంటాక్ట్ లిస్ట్‌లోని కాంటాక్ట్ సెల్‌ను ట్యాప్ చేయడం ద్వారా యూజర్లను ఈజీగా కాలింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. కొత్త రాబోయే ఫీచర్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డివైజ్ హోమ్ స్క్రీన్‌కు ఆటోమాటిక్‌గా యాడ్ చేస్తుందని నివేదిక సూచిస్తుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, నవంబర్‌లో భారత్‌లో36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. అయితే ఈ సంఖ్య.. గత నెలలో నిషేధించిన వాట్సాప్ అకౌంట్ల సంఖ్య కన్నా స్వల్పంగా తక్కువగా ఉందని తెలిపింది. భారత్‌లో నిషేధించిన వాట్సాప్ అకౌంట్లలో 13.89 లక్షల అకౌంట్లు ఉన్నాయి. వాట్సాప్ యూజర్లను ఫ్లాగ్ చేసేందుకు ముందస్తుగా హెచ్చరించింది. డిసెంబర్‌లో, వాట్సాప్ దేశంలో 37.16 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 9.9 లక్షల అకౌంట్లు ముందుగానే బ్యాన్ అయ్యాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : WhatsApp New Updates : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్స్.. ఇకపై యూజర్లు కాల్స్ చేసుకోవడం చాలా ఈజీ తెలుసా?