WhatsApp Moderators : వాట్సాప్ మోడరేటర్లు మీ మెసేజ్‌లు చూస్తున్నారని తెలుసా?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ లో యూజర్ ప్రైవసీకి భద్రతా ఉందా? వాట్సాప్ లో యూజర్ల అనుమతి లేకుండానే మెసేజ్ లను వాట్సాప్ మోడరేటర్లు చూస్తున్నారంట..

WhatsApp Moderators Can Read Your Messages : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ లో యూజర్ ప్రైవసీకి భద్రతా ఉందా? వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసేజింగ్ సర్వీసు అన్నారు కదా.. మరి.. వాట్సాప్ లో మన మెసేజ్ లను వాట్సాప్ మోడరేటర్లు చూస్తున్నారంట.. 2018లో సీఈఓ మార్క్ జూకర్ బర్గ్.. వాట్సాప్ లో కంటెంట్ తాము చూడమని, అదంతా ఎన్ క్రిప్టెడ్ అంటూ వెల్లడించారు. మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా తమ ప్రైవసీ పాలసీలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది వాట్సాప్. ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందంటే.. కొత్త ProPublica report పరిశీలిస్తే.. కచ్చితంగా అవునని చెప్పలేం.. వాట్సాప్ కంటెంట్ మోడరేషన్ సిస్టమ్ యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఒక విషయాన్ని బయటపెట్టింది. వాట్సాప్ యూజర్ల డేటాను WhatsApp Moderators చూస్తారంట.. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది ప్రోప్యూబిలికా రిపోర్టు. ప్రైవసీ ఒరియెంటెండ్ ప్లాట్ ఫాంపై యూజర్ల డేటాను ఫేస్ బుక్ అమ్మే అవకాశం ఉంది. అలాగే వాట్సాప్ లో ఏదైనా యూజర్ రిపోర్టు చేసినప్పుడు అప్పుడు వాట్సాప్ మోడరేటర్లు కొన్ని మెసేజ్ లను చదివే అవకాశం ఉంది.
IPL Ad Revenue : ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?

వెయ్యి మంది మోడరేటర్లతో రివ్యూ :
ఫేసు బుక్ ఇలాంటి ఫ్లాగ్ రిపోర్టెట్ కంటెంట్ రివ్యూ చేసేందుకు ఫేస్ బుక్ కనీసం వెయ్యి మంది మోడరేటర్లను నియమించుకుంది. మోడరేటర్ కాంట్రాక్ట్ సంస్థ Accenture తమ మోడరేటర్లతో మిషన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా రివ్యూ చేయిస్తుంది. అందులో ఎక్కువగా వాట్సాప్ మోడరేటర్లు రివ్యూ చేసే కంటెంట్.. స్పామ్ కంటెంట్, తప్పుడు సమాచారం, అసభ్య పదజాలం, ఉగ్రవాద ముప్పు, పిల్లలపై లైంగిక వేధింపులు (CSAM), బ్లాక్ మెయిల్, మహిళలపై లైంగిక వేధింపులు వంటి కంటెంట్ పై ఎప్పటికప్పుడూ వాట్సాప్ మోడరేటర్లు రివ్యూ చేస్తూనే ఉంటారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వాట్సాప్ యూజర్ల అకౌంట్ బ్యాన్ చేయడం లేదా వారిని వాచ్ చేయడం చేస్తుంటారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంతో పోలిస్తే వాట్సాప్ మోడరేటర్లు వ్యక్తిగత పోస్టులను తొలగించే విధానం వేరుగా ఉంటుంది. ఇలాంటి హింసాత్మక చర్యలకు సంబంధించి మానిటరింగ్ చేయడాన్ని దాదాపు స్వాగతించదగినదే కావొచ్చు.. కానీ, ఇతర వాట్సాప్ యూజర్ల కంటెంట్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రొగ్రామ్ ద్వారా మోడరేటర్లకు చేరుతుందని ProPublica రిపోర్టులో తెలిపింది. అందులో చిన్నారులు బాత్ టబ్ లో ఆడుకునే పోస్టులు కూడా మోడరేటర్లకు రిపోర్టు చేస్తున్నట్టు గుర్తించింది.

చివరి ఐదు మెసేజ్ లను చూడగలరు :
ఇలాంటి కంటెంట్ కనిపించినప్పుడు వాట్సాప్ వెంటనే ఫ్లాగ్ చేస్తుంది. ఆ కంటెంట్ ను మోడరేటర్లకు చేరవేస్తుంది. అలా చివరి ఐదు మెసేజ్ ల వరకు మోడరేటర్లు వాట్సాప్ లో చూడగలరు. వాట్సాప్ తమ Terms of service లో పొందుపరిచిన విషయంలో ఎక్కడా కూడా మోస్ట్ రీసెంట్ మెసేజ్ లను కూడా మోడరేటర్లు చూడగలరని ప్రస్తావించలేదు. ఒకవేళ గ్రూపులోని యూజర్ లేదా వ్యక్తిగత యూజర్ రిపోర్టు చేసిన సందర్భాల్లో మాత్రమే మోడరేటర్లు ఆయా కంటెంట్ చూసే వీలుందని తెలపలేదు. అందులో యూజర్ల ఫోన్ నెంబర్లు, ప్రొఫైల్ ఫొటోలు, ఫేస్ బుక్, ఇన్ స్టా లింకైన అకౌంట్లు, యూజర్ల ఐపీ అడ్రస్, మొబైల్ ఫోన్ ఐడీలను మోడరేటర్లు చూస్తారని ప్రస్తావించలేదు. ప్రైవసీ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా వాట్సాప్ తమ యూజర్లకు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని రిపోర్టు వెల్లడించింది.

డిక్రిప్ట్ చేసిన మెసేజ్‌లను చూసేందుకు వాట్సాప్ ఏ మెకానిజమ్‌ని ఉపయోగిస్తుందనే స్పష్టత ఇవ్వలేదు. ‘Report‘ బటన్‌ని ట్యాప్ చేయగానే.. యూజర్, వాట్సాప్‌కు మధ్య కొత్త మెసేజ్‌ జనరేట్ అవుతుంది. వాట్సప్ ఒక విధమైన కాపీ-పేస్ట్ ఫంక్షన్‌ను అమలు చేస్తున్నట్లు సూచిస్తున్నట్లుగా ఉంది. కానీ దీనిపై వివరాలు ఇప్పటికీ క్లారిటీ లేదనే చెప్పాలి. ఫేస్‌బుక్ వాట్సాప్ మెసేజ్ లను చూడగలదు.. ఎందుకంటే అవి కంపెనీ, రిపోర్ చేసే యూజర్ల మధ్య డైరెక్ట్ మెసేజింగ్ వెర్షన్‌గా పనిచేస్తుంది. కంటెంట్‌ని రిపోర్ట్ చేసే యూజర్లు ఫేస్‌బుక్‌తో సమాచారాన్ని షేర్ చేసేందుకు conscious choice ఎంపిక చేసుకుంటారని రిపోర్టు తెలిపింది. ఇదే లాజిక్ ఫేస్‌బుక్ అప్లయ్ చేస్తోంది. ఇలా రిపోర్టు చేసిన కంటెంట్ సేకరిస్తే అది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఉల్లంఘన కిందకు రాదు. అప్పుడు.. వాట్సాప్ యూజర్ల అనుమతి లేకుండానే WhatsApp మీ మెసేజ్‌‌లను చూడగలదు.
Eco Trapline : ఈ టాయిలెట్‌ వాడితే చుక్క నీరు వాడనవసరం లేదు

ట్రెండింగ్ వార్తలు