Eco Trapline : ఈ టాయిలెట్‌ వాడితే చుక్క నీరు వాడనవసరం లేదు

ఓ మహిళా ఇంజనీర్ నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన టాయ్ లెట్ ను తయారుచేసింది. ఒక్క చుక్క కూడా నీరు వాడాల్సిన అవసరంలేని వినూత్న టాయిలెట్ ను తయారుచేసింది.

Eco Trapline : ఈ టాయిలెట్‌ వాడితే చుక్క నీరు వాడనవసరం లేదు

Ecotrapin

Neha Bagoria Invented ‘Eco Trapline’ : ఆమె ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కానీ ఇప్పుడు నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన పరిష్కారమార్గాన్ని చూపించిన ఓ ఆవిష్కర్త. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను తలకెత్తుకున్న ఓ సంస్కర్త. ఓ కుగ్రామంలో పుట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి ప్రతిభ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆమే రాజస్థాన్ కు చెందిన ‘నేహా బగోరియా’. నేహా గతంలో ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. కానీ చేసే ఉద్యోగం నచ్చలేదు.ఏదో చేయాలనే తపన. అలా ఉద్యోగం మానివేసి..నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన టాయ్ లెట్ ను తయారుచేసింది.

నేహా తయారుచేసిన టాయ్ లెట్ ఉపయోగానికి ఒక్క చుక్క నీరు కూడా అవసరంలేదు.అలాగని టాయ్ లెట్ కంపుకొట్టదు. జంతా వాడినా ఆ టాయిలెట్‌ల నుంచి దుర్వాసన రానేరాదు. ఈ వినూత్న టాయ్ లెట్ పేరు ఎకో ట్రాప్లిన్‌. నేహా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనలోంచి వచ్చిందీ ఈ వినూత్న ఆలోచన. రూపుదిద్దుకున్న ‘ఎకో ట్రాప్లిన్’. వెస్టర్న్‌ టాయిలెట్‌ వాడాక శుభ్రం చేయడానికి ఒకసారి ఫ్లష్‌ చేస్తే..దాదాపు ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ రిలీజ్ అవుతుంది. కానీ నేహ రూపొందించిన ఈ సరికొత్త టాయిలెట్ ఉపయోగిస్తే ఒక్క చుక్క నీరు కూడా అవసరం ఉండదు. రోజంతా వాడినా సరే ఎకో ట్రాప్లిన్‌ నుంచి దుర్వాసన రానేరాదు. ఈ టాయిలెట్ ఇది సెన్సర్‌ ఆధారంగా పని చేస్తుంది. సెన్సర్‌ యాక్టివేట్‌ అవగానే, ఎకో ట్రాప్లిన్‌ సాధనంలో నింపిన కెమికల్ ద్రవం విడుదలవుతుంది. టాయిలెట్‌ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టినట్టేస్తుంది. టాయిలెట్‌ వాడటం ఆగిపోగానే ఈ ద్రవం విడుదల కూడా ఆగిపోతుంది. అలా చుక్క వాటర్ అవసరంలేని టాయిలెట్ ఈ ‘ఎకో ట్రాప్లిన్’.

ముంబయిలో పెరిగిన నేహ రాజస్థాన్‌ రాష్ట్రం.బీవార్‌ సమీపంలోని ఓ కుగ్రామం. నేహ తాత, నానమ్మ అక్కడే ఉండేవారు. ఆమె చిన్నప్పుడు నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లినప్పుడు పల్లెటూరి వాతావరణాన్ని చాలా ఆశ్చర్యంగా గమనించేది.పల్లెటూరిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. దీంతో వాళ్లు నీటిగురించి ఏమాత్రం దిగులు పడేవారుకాదు. కానీ నగరాల్లో అలాకాదు.ముంబైలో పెరిగిన నేహాకు నీటి కరవు గురించి బాగా తెలుసు. అందుకే వాళ్ల నానమ్మ కు చుట్టుపక్కలవారికి నీటి భద్రత గురించి చెప్పేది. నీటిని ఎంత పొదుపుగా వాడాలో చెప్పేది.సెలవుల తర్వాత నేహ తిరిగి ముంబయి వచ్చేసింది. చదువుల్లో పడి నీటి సంరక్షణ ఆలోచన పక్కన పెట్టేసింది.

నేహ చదువు పూర్తయింది. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది.అలా ఉద్యోగం చేస్తున్నా..నేహకు ఏదో ఆలోచన. మంచి జీతం వస్తున్నా..ఉద్యోగంలో తప్తిలేదు. ఏదో వెలితి. ఇదికాదు నేను చేయాల్సింది అనుకునేది. అదే ఆలోచనతో నాలుగేళ్లు గడిచిపోయాయి. అలా అప్పుడు ఆమె దృష్టి కంప్యూటర్‌ మీద నుంచి సమాజం మీదకు మళ్లింది. మరోసారి నీటి సంరక్షణ గురించి తలంపు ఆమెను కుదురుగా ఉద్యోగం చేయనివ్వలేదు. ఉద్యోగానికి రిజైన్ చేసింది.నీరు సమృద్ధిగా వాడే వాళ్ల దగ్గరకు వెళ్లి ‘నీటి వనరును పరిమితంగా వాడండి’ అని చెప్పేది. కానీ ఎవ్వరు వినేవారు కాదు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీద పోస్టులతో సమస్య తీవ్రతను పదిమందికి

తెలియజేసేది. అలా ఎవ్వరికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని కూడా అనుకుంది. మరి ఏం చేయాలి?అనే తపనపడేది. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ‘ఎకో ట్రాప్లిన్‌’. నేహా తన ఆవిష్కరణతో 2013లో ‘టాపు సస్టెయినబుల్‌ సొల్యూషన్స్‌’ పేరుతో ‘ఎకో ట్రాప్లిన్‌’ సాధనాల తయారీ కంపెనీ స్థాపించింది. నేహ మొదటి విడతలో ఎనిమిది వందల సాధనాలను తయారు చేసింది. వాటన్నింటినీ ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. అన్ని కోణాల్లోని పరీక్షించింది. అవన్నీ విజయవంతంగా పని చేస్తున్నాయి. ఒక మంచి ఆలోచన ఒక కొత్త ఆవిష్కరణకు కారకం అవుతుందని నేహ నిరూపించింది. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జీతంతీసుకునేది. ఇప్పుడు నీటి సంరక్షణ కోసం వినూత్న టాయిలెట్ ను తయారు చేయటమే కాదు..ఓ కంపెనీకి యజమాని అయ్యింది.కొంతమందికి జీతాలు ఇస్తోంది.