×
Ad

WhatsApp Security Feature : వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో సైబర్, హ్యాకర్లకు చెక్.. ఇప్పుడే సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి!

WhatsApp Security Feature : వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ మోడ్‌ ప్రవేశపెట్టింది. గుర్తుతెలియని కాల్స్, ఫైల్స్ బ్లాక్ అవుతాయి. ఈ కొత్త ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలంటే?

WhatsApp Security Feature

  • వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ మోడ్‌ ఫీచర్
  • స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఒక క్లిక్‌తో యాక్టివేషన్
  • హ్యాకర్లు, సైబర్ దాడుల నుంచి ఫుల్ ప్రొటెక్షన్
  • అన్ నౌన్ కాల్స్, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ బ్లాక్

WhatsApp Security Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం అత్యంత పవర్ ఫుల్ సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. ఇకపై మీ వాట్సాప్ అకౌంట్ ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. అంతేకాదు.. మీకు అన్ నౌన్ కాల్స్ రావు.. వచ్చినా వెంటనే బ్లాక్ అవుతాయి.. అలాగే ఏదైనా మాల్ వేర్ ఫైల్స్ ఉన్నా కూడా వెంటనే బ్లాక్ చేసేస్తుంది ఈ సెక్యూరిటీ ఫీచర్.

అదే.. స్ట్రిక్ అకౌంట్ సెట్టింగ్స్ (Strict Account Settings) ఫీచర్.. మెటా సొంత యాప్ డిజిటల్ రిస్క్ ఉన్న వాట్సాప్ యూజర్లకు ప్రొటెక్షన్ అందించేందుకు ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీన్నే లాక్‌డౌన్ స్టయిల్ ఆప్షన్ కూడా అనొచ్చు.

అంటే.. ఒక-క్లిక్ బటన్‌గా రన్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే ఒకేసారి అన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఆటోమాటిక్ గా యాక్టివేట్ చేస్తుంది. రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ బ్లాగ్ పోస్టు ప్రకారం.. ఈ ఫీచర్ గుర్తుతెలియని నంబర్ల నుంచి అన్ నౌన్ కాల్స్, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ బ్లాక్ చేస్తుంది. లింక్ ప్రివ్యూలు ఇక కనిపించవు. మీరు చాట్‌లో యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఆయా లింక్ థంబ్‌నెయిల్స్ కనిపించవు.

వాట్సాప్ ఇప్పటికే డిపాల్ట్ గా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అందిస్తోంది. ఈ హై-సెక్యూరిటీ మోడ్‌ ఫీచర్ కూడా తీసుకురావడంతో వాట్సాప్ ఇతర అమెరికా టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. ఆపిల్ 2022లో లాక్‌డౌన్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. అయితే, గూగుల్ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అడ్వాన్స్ ప్రొటెక్షన్ మోడ్‌ రిలీజ్ చేసింది.

Read Also : Vivo V50 5G Price : వావ్.. రూ. 40వేల ఈ వివో V50 5G ఫోన్ జస్ట్ రూ. 28,999కే.. ఆఫర్ ఎలా పొందాలంటే?

ఈ ఫీచర్ ఎవరికోసమంటే? :

మెటా కొత్త స్ట్రిక్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఫీచర్ ముఖ్యంగా జర్నలిస్టులు, యాక్టివిస్టులు, సైబర్ థ్రెట్ ఉన్న ప్రముఖులతో పాటు సాధారణ వినియోగదారులు అందరికి అందుబాటులో ఉంటుందని వాట్సాప్ తెలిపింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉన్నప్పటికీ యూజర్లకు మరింత ప్రైవసీతో పాటు ప్రొటెక్షన్ అందించేందుకు ఈ అడ్వాన్స్ లేయర్ టెక్నాలజీతో ఫీచర్ అవసరమని పేర్కొంది.

‘స్ట్రిక్ అకౌంట్ సెట్టింగ్స్’తో బెనిఫిట్స్ ఏంటి? :
ఈ ఫీచర్ ఒకసారి యాక్టివేట్ అయ్యాక అన్ని ఆప్షన్లకు లిమిటెడ్ యాక్సస్‌తో ఆటోమాటిక్‌గా లాక్ అవుతాయి. తెలియని యూజర్లు పంపిన మీడియా ఫైల్స్, అటాచ్‌మెంట్‌లు డిఫాల్ట్‌గా బ్లాక్ అవుతాయి. మాల్ వేర్ డౌన్‌లోడ్‌ రిస్క్ కూడా ఉండదు.

ఈ ఫీచర్ లింక్ ప్రివ్యూలను కూడా ఆపేస్తుంది. ఏదైనా లింక్‌లను చాట్‌లలో షేర్ చేస్తే కనిపించే థంబ్‌నెయిల్స్ కూడా కనిపించవు. అన్ నౌన్ నంబర్స్ నుంచి వచ్చే మ్యూట్ అవుతాయి. ఇకపై రింగ్ కావు.. మీకు కాల్ వచ్చినట్టుగా కాల్ లాగ్‌లలో కనిపిస్తాయి.

ఎలా ఆన్ చేయాలంటే? :

ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ పొందే యూజర్లు Settings > Privacy > Advanced ఆప్షన్ ఎంచుకుని ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ సింగిల్ స్విచ్‌గా కనిపిస్తాయి. ఒకసారి ఆన్ చేస్తే చాలు.. అన్ని పరిమితులు ఒకేసారి అప్లయ్ అవుతాయి.