WhatsApp New Features : వాట్సాప్‌లో 2 ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్లు.. ఇకపై ప్రైవసీ, ఫోకస్ మరింత ఈజీ..!

WhatsApp New Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు వస్తున్నాయి.. చాట్లను నిర్దిష్ట సమయాల్లో ఆటోమేటిక్‌గా మ్యూట్ లేదా హైడ్ చేయడంతో పాటు రిస్ట్రిక్టెడ్ చాట్స్ ద్వారా ప్రైవసీని మరింత పెంచుకోవచ్చు.

WhatsApp New Features

వాట్సాప్ కొత్త అప్‌డేట్స్.. చాట్స్ మ్యూట్, హైడ్ ఇక ఆటోమేటిక్‌గా
వాట్సాప్ యూజర్లకు ప్రైవసీ, నోటిఫికేషన్లపై కొత్త ఫీచర్లు

WhatsApp New Features : వాట్సాప్ యూజర్లకు పండగే.. ప్రైవసీ కోసం రెండు సరికొత్త ఫీచర్లు రాబోతున్నాయి. నివేదిక ప్రకారం.. ఒక ఫీచర్ ద్వారా నిర్దిష్ట చాట్ లిస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు రావాలో ముందుగానే సెట్ చేసుకునే అవకాశం ఉండనుంది. మరో ఫీచర్‌లో ప్రస్తుత అడ్వాన్స్ చాట్ ప్రైవసీ స్థానంలో రిస్ట్రెక్టెడ్ చాట్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు వాట్సాప్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

చాట్స్ మ్యూట్ లేదా హైడ్ :
వాట్సాప్ ప్లస్ యూజర్ల కోసం డెవపల్ అయ్యే ఈ ఫీచర్‌లో ఎంపిక చేసిన చాట్ లిస్టులను నిర్దిష్ట సమయాల్లో ఆటోమేటిక్‌గా మ్యూట్ లేదా హైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే, యూజర్లు ప్రతిసారీ చాట్లను మాన్యువల్‌గా మ్యూట్, అన్‌మ్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు.

Read Also : Xiaomi 17 Ultra Price Drop : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ షావోమీ 17 అల్ట్రాపై ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్..!

ఉదాహరణకు.. వర్క్ లేదా రీడ్ సమయంలో కొన్ని చాట్ల నుంచి నోటిఫికేషన్లు రాకుండా ముందుగానే టైమ్ సెట్ చేసుకోవచ్చు. తద్వారా అనవసరమైన నోటిఫికేషన్లను తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలోనే ఉంది. బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు.

అడ్వాన్స్ చాట్ ప్రైవసీకి రిస్ట్రిక్టెడ్ చాట్స్ :
మరో అప్‌డేట్‌లో వాట్సాప్ అడ్వాన్సడ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌కు బదులుగా రిస్ట్రిక్టెడ్ చాట్స్ తీసుకువచ్చేందుకు వర్క్ చేస్తోంది. ఈ చాట్స్ ద్వారా మెసేజ్‌లను ఇతరులు చూడకుండా కంట్రోల్ చేయొచ్చు. ఈ చాట్లను ప్రైమరీ డివైజ్‌కే పరిమితం చేసేలా వాట్సాప్ పనిచేస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.26.39.11 వంటి బీటా వెర్షన్‌లలో కొంతమంది టెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారాల్లో మరింత మంది బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే, ఈ రెండు ఫీచర్లను వాట్సాప్ అధికారికంగా రివీల్ చేయలేదు. ఈ ఫీచర్లు ఎప్పుడు స్టేబుల్ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తాయనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.