WhatsApp ChatGPT
WhatsApp ChatGPT : వాట్సాప్‌లో చాట్‌జీపీటీ వాడుతున్నారా? మీరు వాట్సాప్‌లో చాట్‌జీపీటీతో కాజువల్‌గా చాట్ చేసే వ్యక్తి అయితే ఇది మీకోసమే. అతి త్వరలో వాట్సాప్ నుంచి చాట్ జీపీటీ నిష్ర్కమిస్తోంది. అధికారికంగా జనవరి 15, 2026న వాట్సాప్ నుంచి చాట్‌జీపీటీ నిష్ర్కమించనుంది.
ఇప్పటికే మీ చాట్ జీపీటీ వాట్సాప్ డేటా ఉండి ఉంటే వెంటనే (WhatsApp ChatGPT) డేటా సేవ్ చేసి పెట్టుకోండి. అయితే, గడువు తేదీలోగా మాత్రమే మీ డేటా మొత్తాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. లేదంటే మొత్తం డేటా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఓపెన్ఏఐ ఇటీవలే కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం 50 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్‌లో ChatGPTని ఉపయోగిస్తున్నారని తెలిపింది. వాట్సాప్ నుంచి చాట్‌జీపీటీ నిష్ర్కమించక ముందు మీ చాట్‌లను మైగ్రేట్ చేసేందుకు కంపెనీ ఒక మార్గాన్ని అందిస్తోంది.
వాట్సాప్ నుంచి చాట్‌జీపీటీ నిష్ర్కమణ :
చాట్‌జీపీటీ వాట్సాప్ నుంచి నిష్ర్కమించడానికి అసలు కారణం మెటా కొత్త విధానాలే.. జనవరి 2026 నుంచి మెటా ఇకపై సాధారణ-ప్రయోజన ఏఐ చాట్‌బాట్‌లను వాట్సాప్ బిజినెస్ ఏపీఐ రన్ చేసేందుకు అనుమతించదు. చాట్‌జీపీటీ వంటి బాట్‌లు సిస్టమ్‌పై ఎక్కువ లోడ్‌ను పెంచుతాయని, భారీ మెసేజ్ వాల్యూమ్‌లను జనరేట్ చేస్తాయని మెటా పేర్కొంది. సాధారణ ఏఐ అసిస్టెంట్‌లకు కాకుండా కస్టమర్ సర్వీస్ బాట్‌ల వంటి సపోర్టు సెంట్రలైజడ్ ఏఐ టూల్స్‌కు మాత్రమే యాక్సెస్ పరిమితం చేస్తున్నాయని మెటా పేర్కొంది. ఈ విషయంలో ఓపెన్ఏఐ నిరాశ వ్యక్తం చేసింది.
ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. వాట్సాప్ ఏఐ బాట్స్ నుంచి చాట్స్ ఎక్స్‌పోర్ట్ చేసేందుకు అనుమతించదు. “Export Chat” ట్యాప్ చేయలేరు. దానికి బదులుగా ఓపెన్ఏఐ మీ వాట్సాప్ నంబర్‌ను మీ చాట్‌జీపీటీ అకౌంటుకు లింక్ చేయాల్సి ఉంటుంది. మీ పాత చాటింగ్ స్క్రీన్‌షాట్‌లు లేదా మీ లైవ్ హిస్టరీని కాపీ-పేస్ట్ చేయకుండా నేరుగా చాట్‌జీపీటీలో కనిపిస్తాయి.
స్టెప్ బై స్టెప్ గైడ్ :
1. ChatGPT డౌన్‌లోడ్ చేసుకోండి.
Android, iOS, డెస్క్‌టాప్ లేదా (chat.openai.com)కి ఓపెన్ చేయండి.
2. సైన్ ఇన్ చేయండి లేదా అకౌంట్ క్రియేట్ చేయండి.
మీకు ఇప్పటికే OpenAI అకౌంట్ ఉంటే వెంటనే లాగిన్ ఇవ్వండి.
3. మీ వాట్సాప్ నంబర్‌ను లింక్ చేయండి.
చాట్‌జీపీటీ వాట్సాప్ ప్రొఫైల్ (1-800-ChatGPT) ఓపెన్ చేయండి.
ప్రొఫైల్ పేజీలోని లింక్‌ను ట్యాప్ చేయండి.
మీ నంబర్‌ను కనెక్ట్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
చాట్‌జీపీటీతో గత వాట్సాప్ చాట్స్ (వాట్సాప్ సపోర్టు ఆపేసిన తర్వాత) మీ చాట్‌జీపీటీ హిస్టరీలో కనిపిస్తాయి.
జనవరి 15, 2026 తర్వాత జరిగేది ఇదే :