Home Loan EMIs : హోం లోన్ తీసుకున్నారా? HDFC కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న EMIలు.. ఫుల్ డిటెయిల్స్..!

Home Loan EMIs : HDFC బ్యాంక్ ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై తన MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సవరించిన రేట్లు నవంబర్ 7, 2025 నుండి అమలులోకి వస్తాయి.

Home Loan EMIs : హోం లోన్ తీసుకున్నారా? HDFC కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న EMIలు.. ఫుల్ డిటెయిల్స్..!

Home Loan EMIs

Updated On : November 8, 2025 / 10:03 AM IST

Home Loan EMIs : దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు (HDFC) బ్యాంక్ లక్షలాది మంది కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందించింది. గృహ రుణ రేట్లను భారీగా తగ్గించింది. దాంతో హౌస్ లోన్లపై ఈఎంఐలు తగ్గనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) వడ్డీ రేట్లను 0.10 శాతం తగ్గించింది. బ్యాంక్ ప్రతి నెల 7వ తేదీన ఈ రేట్లను సవరిస్తుంది. ఇప్పుడు, ఈ కొత్త రేట్లు నవంబర్ 7, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MCLR రేట్లు తగ్గింపు (Home Loan EMIs) తర్వాత ఇప్పుడు 8.35శాతం నుంచి 8.60శాతం వరకు ఉన్నాయి. గతంలో, ఈ రేట్లు 8.45శాతం, 8.65శాతం మధ్య ఉండేవి. అన్ని కాలపరిమితి గల రుణాలపై 5 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్ల తగ్గింపు పొందవచ్చు. కొత్త రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఓవర్ నైట్ : 8.35 శాతం (MLCR)
ఒక నెల : 8.35 శాతం
3 నెలలు : 8.40 శాతం
6 నెలలు : 8.45 శాతం
1 సంవత్సరం : 8.50 శాతం
2 సంవత్సరాలు : 8.55 శాతం
3 సంవత్సరాలు : 8.60 శాతం

MCLR అంటే ఏంటి? :
ఎంసీఎల్ఆర్ (MCLR) అనేది ఒక బ్యాంకు కస్టమర్‌కు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. ఈ రేటు రుణానికి కనీస వడ్డీ రేటు పరిమితిని నిర్ణయిస్తుంది. వడ్డీ రేట్లలో పారదర్శకత, కస్టమర్ ప్రయోజనాల కోసం ఆర్బీఐ 2016లో MCLR వ్యవస్థను అమలు చేసింది.

Read Also : Redmi Note 14 Pro Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

గృహ రుణ రేట్లు :  
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణాలు రెపో రేటుతో కలిసి ఉంటాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. జీతం పొందే వారు, స్వయం ఉపాధి పొందుతున్న కస్టమర్లకు గృహ రుణ వడ్డీ రేట్లు 7.90శాతం నుంచి 13.20శాతం వరకు ఉంటాయి. ఆర్బీఐ పాలసీ రెపో రేటు + 2.4శాతం నుంచి 7.7శాతం ఆధారంగా బ్యాంక్ ఈ రేటును నిర్ణయిస్తుంది.

బేస్ రేటు, BPLR రేట్లు :

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేటు ప్రస్తుతం 8.90శాతంగా ఉంది. సెప్టెంబర్ 19, 2025 నుంచి ఈ కొత్త రేటు అమలులోకి వస్తుంది. బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR) సంవత్సరానికి 17.40 శాతంగా నమోదైంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ FD వడ్డీ రేట్లు :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.75శాతం నుంచి 6.60శాతం వరకు సీనియర్ సిటిజన్లకు 3.25శాతం నుంచి 7.10శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ FDలకు వర్తిస్తాయి.

18 నెలల కన్నా తక్కువ, 21 నెలల వరకు మెచ్యూరిటీ FDలపై బ్యాంక్ అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ మెచ్యూరిటీలపై సాధారణ కస్టమర్లకు 6.60శాతం వడ్డీని అందిస్తారు. సీనియర్ సిటిజన్లకు 7.10శాతం వడ్డీని పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MCLR రేటు తగ్గింపుతో లక్షలాది మంది గృహ రుణ గ్రహీతలకు భారీ ఉపశమనం కలిగిస్తుంది. వడ్డీ రేట్లలో ఈ స్వల్ప తగ్గుదల అయినప్పటికీ దీర్ఘకాలిక రుణాలపై భారీగా ఈఎంఐ ఆదా చేసుకోవచ్చు.