×
Ad

WhatsApp Messages Limit : బాబోయ్.. వాట్సాప్ కొత్త రూల్ అంట.. ఇకపై మెసేజ్‌లు అదేపనిగా పంపితే అంతే.. లిమిట్ దాటితే బ్లాక్ చేస్తుంది..!

WhatsApp Messages Limit : వాట్సాప్‌లో అన్‌నౌన్‌ నెంబర్లకు ఇకపై పరిమిత సంఖ్యలో మాత్రమే మెసేజ్‌లు పంపగలరు. ఒకవేళ లిమిట్ మించితే మీకు హెచ్చరిక వస్తుంది.

WhatsApp Messages Limit

WhatsApp Messages Limit : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో స్పామ్ మెసేజ్ తీవ్రత పెరుగుతోంది. ఈ స్పామ్ కంటెంట్ కు చెక్ పెట్టేందుకు మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. వాట్సాప్ యూజర్లు, బిజినెస్ అకౌంట్లకు తెలియని నంబర్‌లకు పంపగల మెసేజ్ సంఖ్యను పరిమితం చేసే కొత్త రూల్ త్వరలో అమల్లోకి రానుంది.

మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు (WhatsApp Messages Limit) తెలియని వ్యక్తులకు పదే పదే మెసేజ్ పంపే యూజర్లు, బిజినెస్ అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్‌ను తగ్గించడానికి త్వరలో మెసేజ్ లిమిట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందుకోసం మెసేజ్ లిమిట్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. అనంతరం వాట్సాప్ యూజర్ల అందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

కొత్త నిబంధనలివే :
ఇప్పుడు, ఒక వాట్సాప్ యూజర్ లేదా మర్చంట్ అకౌంట్ పంపిన ప్రతి మెసేజ్ సమాధానం వచ్చిందా లేదా అనేది లెక్కిస్తుంది. తెలియని వ్యక్తికి సందేశం పంపితే వారు ఆన్సర్ ఇవ్వకపోతే ఆ మెసేజ్ నెలవారీ పరిమితిలో లెక్కిస్తుంది. ఆ తర్వాత లిమిట్ విధిస్తుంది.

Read Also : UPI Payments : విదేశాలకు వెళ్తున్నారా? ఈ 10 దేశాల్లో భారతీయ యూజర్లు ఈజీగా UPI పేమెంట్లు చేసుకోవచ్చు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

లిమిట్ దాటితే అలర్ట్ :
వాట్సాప్ మెసేజ్ లిమిట్ దగ్గరపడే కొద్ది యాప్ పాప్-అప్ అలర్ట్ డిస్‌ప్లే చేస్తుంది. వినియోగదారులకు ముందుగానే అలర్ట్ ద్వారా తెలియజేస్తుంది. తద్వారా యూజర్లు తమ అకౌంట్ బ్లాక్ అయిందని గమనించాలని మెసేజింగ్ దిగ్గజం తెలిపింది. వినియోగదారులు లిమిట్ దాటితే వారికి తెలియని వ్యక్తులకు మరిన్ని మెసేజ్‌లను పంపకుండా టెంపపరీగా బ్లాక్ చేస్తుంది.

అనేక దేశాలలో ఫీచర్ టెస్టింగ్ :
రాబోయే వారాల్లో కంపెనీ ఈ ఫీచర్‌ను అనేక దేశాలలో టెస్టింగ్ చేయనుంది. భారత్ సహా కొన్ని ప్రధాన మార్కెట్లలో త్వరలో టెస్ట్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ సిస్టమ్ ప్రధానంగా స్పామ్‌ను నిరోధించేందుకు రూపొందించింది. సాధారణ యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని వాట్సాప్ చెబుతోంది.

మెసేజ్ లిమిట్ ఎందుకంటే? :
వాట్సాప్ ఇకపై కేవలం చాట్ యాప్ కాదు. వ్యాపారం, కమ్యూనికేషన్ కోసం అద్భుతమైన టూల్. ప్రతిరోజూ డజన్ల కొద్దీ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇందులో చాలా వరకు ప్రమోషనల్ లేదా స్పామ్ ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు అనవసరమైన మెసేజ్‌లను నివారించేందుకు 2024లో వాట్సాప్ మార్కెటింగ్ మెసేజ్ లిమిట్స్, అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది.

అదనంగా, ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ మెసేజ్ లిమిట్స్ అమల్లోకి తెచ్చింది. ఈ ప్రయోగాన్ని ఇప్పుడు 500 మిలియన్లకు పైగా యూజర్లు కలిగిన భారత్ సహా 12కి పైగా దేశాలకు విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.