WhatsApp Audio Sessions : వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్.. ఆడియో సెషన్లలో 32 మంది గ్రూపుల సభ్యులు మాట్లాడుకోవచ్చు!

WhatsApp Audio Sessions : వాట్సాప్‌లో సరికొత్త కొత్త వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా ఆడియో సెషన్లతో కనెక్ట్ కావచ్చు. 32 మంది గ్రూపు సభ్యుల వరకు మాట్లాడుకోవచ్చు.

WhatsApp Audio Sessions : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లేటెస్ట్ బీటా వెర్షన్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా 32 మంది కాంటాక్టు గ్రూపు సభ్యులు లైవ్‌లో మాట్లాడే సెషన్‌లలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, 2 బిలియన్ల కన్నా ఎక్కువ యూజర్ బేస్‌తో మరింత వినియోగదారులను ఒకచోట చేర్చడం ద్వారా వాయిస్ కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.

ఇటీవలే, వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో సరికొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. దీని ద్వారా 32 మంది కాంటాక్టుల గ్రూపులు ఆడియో సెషన్‌లలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. WABetaInfo ప్రకారం.. కొత్త 2.23.16.19 బీటా వెర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టెస్టర్‌లకు అందుబాటులోకి తీసుకోస్తోంది. టెలిగ్రామ్, డిస్కార్డ్, స్లాక్స్ హడిల్స్, మెటా సొంత మెసెంజర్ ప్లాట్‌ఫారమ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో సమానంగా ఫీచర్లను అందిస్తుంది.

Read Also : WhatsApp Accounts : వాట్సాప్ అకౌంట్లకు త్వరలో ఇ-మెయిల్ వెరిఫికేషన్.. ఈ కొత్త ఫీచర్‌తో హ్యకర్లకు చెక్ పడినట్టేనా?

ఈ ఫీచర్ లైవ్ వెర్షన్‌కి యాక్సెస్ కలిగిన యూజర్‌లు గ్రూప్ చాట్‌లలో వేవ్‌ఫార్మ్ ఐకాన్ చూడవచ్చు. అయితే, వాట్సాప్ అకౌంట్ ఫీచర్‌ని కలిగి ఉంటే.. గ్రూపుకు సపోర్టు చేస్తే మాత్రమే ఈ ఐకాన్ కనిపిస్తుంది. వాయిస్ చాట్‌ వేవ్‌ఫార్మ్ ఐకాన్ సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. ప్రత్యేక వాయిస్ చాట్ ఇంటర్‌ఫేస్‌కు దారి తీస్తుంది.

ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత గ్రూప్‌లోని ఎవరైనా గరిష్టంగా 32 మంది పాల్గొనేవారు, నేరుగా ఆడియో సేషన్లలో చేరవచ్చు. ఆపై కాంటాక్టులోని సభ్యులు మాట్లాడుకోవచ్చు. సాంప్రదాయ గ్రూపు కాల్‌ల మాదిరిగా కాకుండా, ఈ కొత్త ఫీచర్ ద్వారా అందరి ఫోన్‌లను ఒకే సమయంలో రింగ్ చేయదని గమనించాలి.

WhatsApp to soon allow groups of up to 32 people connect for audio sessions

గ్రూపు సభ్యులు పాల్గొన్న వెంనటే వాయిస్ చాట్ సెషన్ కొనసాగుతుంది. కానీ, ఒక గంట తర్వాత ఆటోమాటిక్‌గా ఆగిపోతుంది. యాప్‌లోని వాయిస్ చాట్‌లు డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయి. యూజర్ల భద్రత దృష్ట్యా వాట్సాప్ ప్రైవసీని అందిస్తోంది.

ముఖ్యంగా, ఈ కొత్త ఫీచర్ కేవలం బీటా ఇన్‌స్టాలేషన్‌లకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. WABetaInfo ఈ ఫీచర్ త్వరలో రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం వాట్సాప్ మాత్రమే కాదు.. టెలిగ్రామ్ 2020 నుంచి వాయిస్ చాట్ ఫీచర్లను అందిస్తోంది. వాట్సాప్ భారీ యూజర్ బేస్‌తో ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. వాట్సాప్ ఈ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ సాయంతో ఆడియో సెషన్ల ద్వారా కనెక్ట్ అయ్యేలా యాప్ యుటిలిటీని అందిస్తుంది.

Read Also : OnePlus Foldable Phone : వన్‌ప్లస్ ఫస్ట్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు