OnePlus Foldable Phone : వన్‌ప్లస్ ఫస్ట్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

OnePlus Foldable Phone : వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ. 1.2 లక్షల లోపు ధరతో రానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 2 SoCని కలిగి ఉండవచ్చు.

OnePlus Foldable Phone : వన్‌ప్లస్ ఫస్ట్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

OnePlus Open foldable smartphone India price leaked ahead of official launch

OnePlus Foldable Phone : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ నుంచి అతి త్వరలో మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ మొట్టమొదటి ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికారిక లాంచ్‌కు ముందు, ఫోన్ స్పెసిఫికేషన్‌లు, డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ధర గురించి X (గతంలో ట్విట్టర్)లో అందించారు. అత్యంత ఖరీదైన వన్‌ప్లస్స్మార్ట్‌ఫోన్ కావచ్చునని తెలుస్తోంది.

టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ధర రూ. 1.2 లక్షల లోపు ఉంటుంది. రూమర్డ్ స్పెసిఫికేషన్‌ల ఆధారంగా.. గతంలో ఇదే ధర పరిధిని నివేదించాం. ఈ పుకారు నిజమైతే.. రూ. 1,54,999 ధర కలిగిన శాంసంగ్ గెలాక్సీ Z Fold 5 కన్నా OnePlus ఓపెన్‌ను మరింత సరసమైనదిగా చేస్తుంది. అయినప్పటికీ, అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోల్డింగ్ ఫోన్.. గూగుల్ కూడా పిక్సెల్ ఫోల్డ్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో ఇప్పటికీ లాంచ్ కాలేదు.

Read Also : OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డీల్స్, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

వన్‌ప్లస్ ఓపెన్ వన్‌ప్లస్ ధర హిస్టరీలో కూడా పెద్ద ఎత్తుకు చేరుకుంటుంది. కంపెనీ వన్‌ప్లస్9 Pro ఫోన్ 256GB స్టోరేజ్‌తో రూ. 69,999కి లాంచ్ చేసింది. అదే స్టోరేజ్ వన్‌ప్లస్10 Pro ఫోన్ ధర రూ.71,999కి లాంచ్ చేసింది. మరోవైపు, ప్రస్తుత జనరేషన్ వన్‌ప్లస్ 11 5G ఫోన్ అదే 256GB స్టోరేజీతో రూ. 61,999 వద్ద మరింత సరసమైనది.

OnePlus Open foldable smartphone India price leaked ahead of official launch

OnePlus Open foldable smartphone India price leaked ahead of official launch

లీక్‌ల ఆధారంగా పరిశీలిస్తే.. వన్‌ప్లస్ ఓపెన్ Oppo Find N2 మాదిరిగా ఉండనుంది. వన్‌ప్లస్ సిస్టర్ బ్రాండ్ నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉంది. వాస్తవానికి, OnePlus సహ-వ్యవస్థాపకుడు (Pete Lau) 2021లో ఫస్ట్ జనరేషన్ (Oppo Find N)ని అందించారు. అంటే.. వన్‌ప్లస్ ఓపెన్ వైడ్ బాడీ ఫోల్డబుల్ ఫోన్ అందించవచ్చు.

వన్‌ప్లస్ One ఫోన్ Snapdragon 8+ Gen 2 SoC, 2K 120Hz AMOLED (LTPO) డిస్‌ప్లే, 100W SuperVOOC ఛార్జింగ్‌తో కూడిన 4800mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. కంపెనీ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించవచ్చు. బ్యాక్ సైడ్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన 3 కెమెరా సెన్సార్‌లు ఉండవచ్చు. బ్యాక్ కెమెరా సిస్టమ్‌లో 50MP (IMX 890) ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు.

కవర్ డిస్‌ప్లే హోల్-పంచ్ కటౌట్ లోపల 32MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉండవచ్చు. ప్రధాన డిస్‌ప్లేలో మరో సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. రెండర్‌లు బ్లాక్ కలర్ వేరియంట్‌ను కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కంపెనీ మరో ఆప్షన్ ప్రవేశపెట్టవచ్చు.

Read Also : OnePlus Ace 2 Pro Launch : ఆగస్టు 16న వన్‌ప్లస్ Ace 2 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!