WhatsApp : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. రానున్న కొత్త ఫీచర్లలో ఏయే ఫీచర్ ఎలా పనిచేయనుందో తెలుసా?

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్ల సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లతో రానుంది. వాట్సాప్ ఇప్పుడు 'Forward Media' అనే క్యాప్షన్, 'Background Blur', 'గ్రూప్‌లలోని ప్రొఫైల్ ఫోటోలు' వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోచిస్తోంది.

WhatsApp to soon get more updates, expect new forward options and some more

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్ల సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లతో రానుంది. వాట్సాప్ ఇప్పుడు ‘Forward Media’ అనే క్యాప్షన్, ‘Background Blur’, ‘గ్రూప్‌లలోని ప్రొఫైల్ ఫోటోలు’ వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోచిస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp ఫొటో బ్లర్ టూల్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

WhatsApp కూడా కొత్త ‘Forward media with caption‘ కోసం బీటా టెస్టింగ్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. మీడియాతో పాటు టెక్స్ట్‌ను ఫార్వార్డ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ‘గ్రూపులలో ప్రొఫైల్ ఫోటోలు’ చాట్ గ్రూప్‌లోని పేర్లతో పాటు యూజర్ల ప్రొఫైల్ ఫోటోలను అందిస్తుంది. WhatsApp రిలీజ్ చేసే కొత్త ఫీచర్ల గురించి ఓసారి పరిశీలిద్దాం.

WhatsApp Image Blur Tool :
వాట్సాప్ బీటా వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా యూజర్ల కోసం కొత్త ఇమేజ్ బ్లర్ టూల్‌ను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ టూల్ యూజర్ల ఫొటో నుంచి కొన్ని పార్టులను బ్లర్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఫొటోల నుంచి సున్నితమైన డేటాను ఫొటో క్వాలిటీ దెబ్బతినకుండా చక్కగా బ్లర్ చేయడంలో సాయపడుతుంది.

నివేదికల ప్రకారం.. WhatsApp రెండు బ్లర్ టూల్స్‌ను డెవలప్ చేసింది. అల్ట్రానేట్ బ్లర్ ఎఫెక్ట్‌ని ఉపయోగించడం ద్వారా యూజర్లు తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది. గ్రాన్యులర్ కచ్చితత్వంతో ప్రభావాన్ని అందించేందుకు యూజర్లు బ్లర్ బ్రష్ సైజును కూడా ఎంచుకోవచ్చు.

WhatsApp to soon get more updates, expect new forward options and some more

వాట్సాప్ ఇమేజ్ బ్లర్ టూల్ ఫీచర్ మొదటిసారిగా ఈ ఏడాది జూన్‌లో కనిపించింది. ప్రస్తుతానికి, కొంతమంది WhatsApp డెస్క్‌టాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. మీరు ఇప్పటికీ WhatsAppలో మీ ఇమేజ్‌లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి బ్లర్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్‌లో చిన్న బ్లర్ టూల్ అందుబాటులో ఉంది. బ్లర్ బ్రష్ పెన్, హైలైటర్‌తో పాటు అందుబాటులో ఉంటుంది. ఇమేజ్‌లలోని ఎంచుకున్న భాగాలను బ్లర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Forward media with a caption :
WhatsApp ప్రస్తుతం మీరు ఫొటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది, కానీ, క్యాప్షన్లతో కాదు.. యూజర్లు మీడియాను ఫార్వార్డ్ చేయాలి. ఆపై విడిగా రాయాలి. సంబంధిత టెక్స్ట్ రాయాలి. కానీ, ‘ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్’ అనే కొత్త ఫీచర్‌తో, యూజర్ల క్యాప్షన్‌లతో పాటు ఫొటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేయవచ్చు. ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ కోసం అందుబాటులోకి వస్తోంది. భవిష్యత్ యాప్ అప్‌డేట్‌లలో త్వరలో WhatsApp మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

Profile photos within groups :
ప్రముఖ వాట్సాప్ ఆకర్షించిన మరో రాబోయే WhatsApp ఫీచర్ గ్రూప్ చాట్‌లలో ప్రొఫైల్ ఫోటోలను చూపిస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ సభ్యుల ప్రొఫైల్ ఫోటోను గ్రూప్ చాట్‌లో మెసేజ్‌లతో పాటు చూపిస్తుంది. గ్రూప్ మెంబర్‌కి ప్రొఫైల్ పిక్చర్ లేకుంటే లేదా అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. WhatsApp నుంచి డిఫాల్ట్ ప్రొఫైల్ ఐకాన్ అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. కానీ, త్వరలో బీటా టెస్టింగ్ కోసం రిలీజ్ చేసేందుకు అందుబాటులో భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

ట్రెండింగ్ వార్తలు