WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.  ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.

WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

WhatsApp Services Down

WhatsApp Services Down: వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.  ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:30గంటల నుంచి సేవలు నిలిచిపోయాయి. అయితే, వాట్సాప్‌ సేవలను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.

Solar Eclipse Watch Like This: సూర్యగ్రహణాన్ని చూస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

ఈ విషయంపై మెటా యాజమాన్యం ప్రతినిధి మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి కంపెనీ కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని మాకు సమాచారం ఉందని, వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నామని రాయిటర్స్ ప్రతినిధికి తెలిపారు. రియల్‌టైమ్ మానిటర్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వినియోగదారులు అంతరాయం ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

భారతదేశంలో 11వేల కంటే ఎక్కువ మంది వినియోగదారులు అంతరాయాన్ని నివేదించారు, యూకే, సింగపూర్‌లలో సంఖ్యలు వరుసగా 68వేలు, 19వేల మంది వరకు వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు ఫిర్యాదులు చేశారు. ఇదిలాఉంటే వాట్సాప్ సేవలు నిలిచిపోవటంపై ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. హాస్యంతో కూడిన ఫొటోలను జోడిస్తూ ట్విటర్ లోకి వచ్చేయండి అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు హల్ చల్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా రోజుకు 10 వేల కోట్ల చొప్పున మెసేజ్‌లు వెళ్తుంటాయి. వాట్సాప్‌ డౌన్‌ కావడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు.