Solar Eclipse Watch Like This: సూర్యగ్రహణాన్ని చూస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

గ్రహణం వీక్షించడానికి ప్రత్యామ్నాయంగా సాధారణ సన్ గ్లాసెస్‌ను వాడటం మంచిది కాదు. గ్రహణాన్ని కెమెరాల్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే సరైన గ్లాస్‌లు ధరించకపోతే సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన కిరణాలు కళ్లకు హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Solar Eclipse Watch Like This: సూర్యగ్రహణాన్ని చూస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

Solar Eclipse

Solar Eclipse Watch Like This: భారతదేశంలో నేడు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది. సాయంత్రం వేళల్లో ఈ పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తోంది. అయితే దీనిని చూసేందుకు చాలా మంది భయపడతారు. సూర్య గ్రహణాన్ని చూడకూడదని, చూస్తే పలు రకాల అనర్ధాలు జరుగుతాయని భయపడుతుంటారు. అయితే, తగిన రక్షణ చర్యలతో సూర్య గ్రహణాన్ని వీక్షించవచ్చనేది చాలామంది వాదన. ముఖ్యంగా సోలార్ ఫిల్టర్లు ధరించి సూర్య గ్రహణం చూడాలి.

Solar Eclipse

Solar Eclipse

సూర్య గ్రహణం చేసేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

⇒గ్రహణం వీక్షించడానికి ప్రత్యామ్నాయంగా సాధారణ సన్ గ్లాసెస్‌ను వాడటం మంచిది కాదు.

⇒గ్రహణాన్ని కెమెరాల్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే సరైన గ్లాస్‌లు ధరించకపోతే సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన కిరణాలు కళ్లకు హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

⇒ పెద్దలు పర్యవేక్షించే అవకాశం లేకపోతే గ్రహణం చూసే ప్రాంతాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

⇒ సోలార్ ఫిల్టర్లు లేకుండా సూర్యుని‌వైపు కొన్ని సెకెన్లు పాటు చూడటం దీర్ఘకాల, కోలుకోలేని విధంగా కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.

⇒ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. మీరు దానిని సెకనులో ఒక భాగానికి మించి చూస్తే మీ రెటినాకు తీవ్రమైన గాయం అయ్యే ప్రమాదం ఉందని అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రెస్ ఆఫీసర్ రిక్ ఫియెన్‌బర్గ్ చెప్పారు.

⇒ సూర్యగ్రహణం చూసేముందు మీరు సోలార్ ఫిల్టర్‌‌ను వాడాలి. దానిని ఉపయోగించేముందు తనిఖీ చేసుకోవాలి. ఎక్కడైనా హోల్స్ ఉన్నా, గీతలు ఉన్నా వాటి స్థానంలో నాణ్యమైన సోలార్ ఫిల్టర్‌ను ఉంచుకోవాలి.

⇒ సోలార్ ఫిల్టర్‌లను ఉపయోగించి సూర్యగ్రహణం చూసే పిల్లలను పెద్దలు పర్యవేక్షిస్తుండాలి.

⇒ మీరు సాధారణ కళ్లద్దాలు ధరించినట్లేతే నేరుగా గ్రహణాన్ని చూడకుండా వాటిపై సోలార్ గ్లాసెస్ తప్పనిసరిగా ధరించాలి.

⇒ప్రకాశవంతమైన సూర్యుని వైపు చూసే ముందు సోలార్ అద్దాలతో, సోలార్ వ్యూయర్‌తో మీ కళ్ళను కప్పుకోండి.

⇒ సూర్యుడిని చూసిన తర్వాత దూరంగా వెళ్లిన తరువాతనే మీ కళ్లనుండి వాటిని తీసివేయండి. సూర్యగ్రహణం చూస్తున్నప్పుడు మీ సోలార్ కళ్లద్దాలను ఎట్టిపరిస్థితుల్లో తీసివేయవద్దు.

⇒ ఫిల్టర్ చేయని కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్‌లు, ఇతర ఆప్టికల్ పరికరం ద్వారా గ్రహణం, పాక్షికంగా గ్రహణం చూడవద్దు.

⇒ ఏదైనా టెలిస్కోప్, బైనాక్యులర్లు, కెమెరా లెన్స్, ఇతర ఆప్టిక్స్ పరికరాలతో సూర్యగ్రహణాన్ని చూడాలంటే దాని ముందు భాగంలో సోలార్ ఫిల్టర్‌లు తప్పనిసరిగా జోడించబడాలని గుర్తుంచుకోండి.