WhatsApp Users Alert : ఇది విన్నారా? ఈ 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp Users Alert : ఈ కారణంతోనే రానున్న రోజుల్లో మొత్తం 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ రిలీజ్ చేసే కొత్త ఫీచర్లు సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లను వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

WhatsApp Users Alert : ఇది విన్నారా? ఈ 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp to stop working on these 35 smartphones ( Image Source : Google )

WhatsApp Users Alert : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో కొన్ని మోడల్స్‌కు వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. మెటా సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను మిలియన్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. అత్యంత పాపులారిటీ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ సర్వీసులలో మెసేజ్ లు పంపడమే కాదు.. ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్ కూడా చేసుకునే వీలుంది.

Read Also : Airtel Mobile Tariff Hike : జియో బాటలో ఎయిర్‌టెల్.. మొబైల్ టారిఫ్ ఛార్జీలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!

వాట్సాప్ కూడా తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి వాట్సాప్ అన్ని ఫోన్లలో దాదాపు సపోర్టు చేస్తుంది. కానీ, కొన్ని కాలం చెల్లిన స్మార్ట్‌ఫోన్లు లేదా సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిచిపోయిన ఫోన్లలో మాత్రం ఈ వాట్సాప్ సర్వీసులు పనిచేయవు. అందులో ప్రధానంగా ఆపిల్ బ్రాండ్ నుంచి ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో మొత్తంగా 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, సోనీ, ఎల్‌జీ ఫోన్లు, లెనోవో‌తో పాటు ఇతర బ్రాండ్ల మొబైల్స్‌లో కూడా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నట్టు మెటా కంపెనీ ప్రకటించింది. వాట్సాప్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగుపర్చేందుకు మెటా ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.

మెటా ప్రకారం.. ఇప్పటివరకూ నిలిపివేసిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్లు సపోర్టు చేయవు. కొత్త ఫీచర్లకు తగినట్టుగా టెక్నాలజీ అందుబాటులో లేవు. ఈ కారణంతోనే రానున్న రోజుల్లో మొత్తం 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అనేక స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులను నిలిపివేయగా, కొత్తగా మరికొన్ని స్మార్ట్ ఫోన్లలో కూడా సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ జాబితాలో ఏయే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి.

వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఇవే :
Samsung : Galaxy Ace Plus, Galaxy Express 2, Galaxy Core, Galaxy Note 3, Galaxy Grand, Galaxy S4 Active, Galaxy S3 Mini, Galaxy S4 Zoom, Galaxy S4 Mini,
Motorola : Moto X Phone And Moto G
APPle : iPhone 6, iPhone 5, iPhone SE, iPhone 6S Plus, iPhone 6S
Huawai : Huawei GX1, Ascend G525, Huawel Y625, Ascend P6 S
Lenovo : Lenovo A858T, Lenovo 46,600, Lenovo S890, Lenovo P70,
Sony : Xperia E3, Xperia Z1 Phones
LG G : Optimus 4X HD, Optimus L7, Optimus G Pro, Optimus G

వాట్సాప్ రిలీజ్ చేసే కొత్త ఫీచర్లు సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లను వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. లేదంటే ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ప్రస్తుత వాట్సాప్ వెర్షన్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ మాత్రమే వర్క్ చేస్తుంది. అదేవిధంగా, ఐఫోన్‌లో తప్పనిసరిగా iOS12 లేదా ఆపై వెర్షన్ అప్‌డేట్ ఫీచర్లతో ఉండాలి.

ఈ వెర్షన్ కన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే ఫోన్లలో మాత్రం వాట్సాప్ సర్వీసులు పనిచేయవు. మీరు వాడే స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టు చేస్తుందో లేదో తెలుసుకోండి.

మీ ఫోన్ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ చేయకపోతే.. వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉంటాయని గమనించాలి. మీ ఫోన్ వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవడం ఎంతైన మంచిదని సైబర్ నిపుణులు సైతం సూచిస్తున్నారు.

Read Also : Jio Tariff Charges : కొడుకు పెళ్లి ఖర్చు మాపై వేస్తున్నావా అంబానీ మావా.. జియో రీఛార్జ్ ధరల పెంపుపై భారీగా ట్రోల్స్..!