WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!

వాట్సాప్ వాడుతున్నారా? మీ వాట్సాప్‌లో వచ్చే ప్రతి మెసేజ్ చూడాలంటే ప్రతిసారి చాట్ ఓపెన్ చేయాల్సి వస్తుందా? వాట్సాప్ కాంటాక్ట్ ఓపెన్ చేయకుండానే చాట్ మెసేజ్ చదివేయొచ్చు.

WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ వాట్సాప్‌లో వచ్చే ప్రతి మెసేజ్ చూడాలంటే ప్రతిసారి చాట్ ఓపెన్ చేయాల్సి వస్తుందా? వాట్సాప్ కాంటాక్ట్ ఓపెన్ చేయకుండానే చాట్ మెసేజ్ చదివేయొచ్చు. సాధారణంగా మీ ఫోన్ నోటిఫికేషన్ ప్యానల్‌పై అన్ని మెసేజ్ లను చదవొచ్చు. ఇదేకాదు.. మరో మెథడ్ కూడా ఉంది.. యాప్ ఓపెన్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకోవచ్చు. అదేలానో ఓసారి చూద్దాం..

WhatsApp on mobile:
step-1 : హోం స్ర్కీన్ పై లాంగ్ ప్రెస్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్, మెనూపై పాప్ అప్ కనిపిస్తుంది.

step-2 : Widgets బటన్ పై ట్యాప్ చేయండి. అక్కడ మీకు చాలా Shortcuts కనిపిస్తాయి. అందులో Whatsapp షార్ట్ కట్ కనిపిస్తుంది.

step-3 : మీకు వేర్వేరుగా వాట్సాప్ Widgets కనిపిస్తాయి. అందులో “4 x 1 WhatsApp” Widget పై ట్యాప్ చేయాలి.
Apple iPhone 13 : నో టవర్ సిగ్నల్.. ఈ ఫోన్లలో శాటిలైట్ నుంచి నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు..!

ఆ విడ్జెట్ టచ్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి. ఆ విడ్జిట్ మీ హోం స్ర్కీన్లలో ఒకదానిలో డ్రాప్ చేయాలి. మీ స్ర్కీన్ లోకి విడ్జిట్ యాడ్ అవుతుంది. దానిపై లాంగ్ ప్రెస్ చేస్తే ఎక్స్ ప్యాండ్ అవుతుంది. అప్పటినుంచి వాట్సాప్ చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ వాట్సాప్ కు ఏదైనా మెసేజ్ వచ్చినా ఓపెన్ చేయకుండానే చూడొచ్చు. కొత్త మెసేజ్‌లే కాదు.. పాత మెసేజ్ లను కూడా చూడొచ్చు. కానీ, విడ్జిట్ పై ఏదైనా చాట్ ఓపెన్ చేస్తే మాత్రం.. మీరు మెసేజ్ చూసినట్టుగా యూజర్ కు తెలిసిపోతుంది.

WhatsApp Web:
వాట్సాప్ వెబ్.. డెస్క్ టాప్ వెర్షన్ లో కూడా చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదవొచ్చు. అదేలానంటే.. మీరు వచ్చిన మెసేజ్ పై మౌజ్ కర్సర్ పెడితే చాలు.. చాట్ మెసేజ్ వివరాలు డిస్ ప్లే కనిపిస్తాయి. కొత్త మెసేజ్ లు మాత్రమే చూడొచ్చ.. పాత మెసేజ్ లు చూడాలంటే తప్పనిసరిగా చాట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Chinese Apps : నిషేధాన్ని ధిక్కరిస్తూ.. ఇండియాలో గుట్టుగా పెరిగిపోతున్న చైనా యాప్స్!

ట్రెండింగ్ వార్తలు