Apple iPhone 13 : నో టవర్ సిగ్నల్.. ఈ ఫోన్లలో శాటిలైట్ నుంచి నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు..!

మొబైల్ యూజర్లను వేధించే ప్రధాన సమస్య.. నెట్ వర్క్ కవరేజ్ ఇష్యూ.. ఫోన్ కాల్స్ చేసుకోలేరు.. అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది.

Apple iPhone 13 : నో టవర్ సిగ్నల్.. ఈ ఫోన్లలో శాటిలైట్ నుంచి నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు..!

Apple Iphone 13 To Reportedly Feature Satellite Connectivity Feautre

Apple iPhone 13  feature satellite connectivity : మొబైల్ యూజర్లను వేధించే ప్రధాన సమస్య.. నెట్ వర్క్ కవరేజ్ ఇష్యూ.. ఫోన్ కాల్స్ చేసుకోలేరు.. ఇది మొబైల్ ఉన్న ప్రతిఒక్కరికి ఎదురయ్యే సమస్యే.. ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే అక్కడ సెల్యూలర్ నెట్ వర్క్ కవరేజీ ఉండదు. దాంతో అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తమ ఐఫోన్లలో కొత్త కమ్యూనికేషన్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. satellite communication connectivity.. ఈ కనెక్టివిటీ ద్వారా సెల్యూలర్ నెట్ వర్క్ తో సంబంధం లేకుండా నేరుగా శాటిలైట్ నుంచే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. టెక్స్ట్ పంపుకోవచ్చు.. ఈ మేరకు ఆపిల్ యానలిస్ట్ Ming-Chi Kuo ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కనెక్టవిటీ అన్ని ఐఫోన్లలో ఉండదు.. కేవలం ఒక ఐఫోన్ మోడల్ Apple iPhone 13 లోనే రాబోతుందట..

ఐఫోన్ 13లో కొత్త హార్డ్‌వేర్ :
రాబోయే Apple iPhone 13 హ్యాండ్‌సెట్‌లో కొత్త హార్డ్‌వేర్ ఉంటుంది. దీని ద్వారా తక్కువ భూమి కక్ష్య ఉపగ్రహాలను ట్యాప్ చేసేందుకు వీలు ఉంటుంది. 4G లేదా 5G కవరేజ్ లేని ప్రాంతాల్లో ఈజీగా కనెక్ట్ కావొచ్చు. ఇందుకోసం ఐఫోన్ 13 హ్యాండ్ సెట్‌లో Qualcomm X60 బేస్‌బ్యాండ్ చిప్‌ను ఉపయోగిస్తోంది. తద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్‌లకు సపోర్ట్ చేస్తుంది. సెల్యులార్ సర్వీస్ సరిగా పనిచేయని ప్రాంతాలలో నివసించే మొబైల్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ యానలిస్ట్ భావిస్తున్నారు. అలాగే కవరేజ్ లేని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఐఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని చెబుతున్నారు. ఎక్కడైనా నెట్ వర్క్ అందని ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిర్భయంగా ఉండొచ్చునని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ఐఫోన్ ఉండగా.. దిగులేందుకు దండగ అన్నట్టుగా ప్రశాంతంగా ఉండొచ్చునమాట..
Chinese Apps : నిషేధాన్ని ధిక్కరిస్తూ.. ఇండియాలో గుట్టుగా పెరిగిపోతున్న చైనా యాప్స్!

సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టే ఛాన్స్ :
కమ్యూనికేషన్‌ వ్యవస్థ అనేది సాధారణంగా శాటిలైట్ ఫోన్ల కోసం పనిచేస్తుంటాయి. LEO శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ గ్లోబల్‌స్టార్‌ను టెక్నాలజీ సర్వీస్ కవరేజ్ పరంగా ఆపిల్‌తో సహకరించే అవకాశం ఉందని ఆపిల్ యానలిస్ట్ Ming-Chi Kuo అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్టార్ ఎన్నో ఏళ్లుగా ఎత్తులోనూ వాయిస్ సర్వీసుల కోసం డజన్ల కొద్దీ శాటిలైట్లను ఆపరేట్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చిన్న నాచ్ తో అప్‌గ్రేడ్ డిజైన్, మందపాటి కెమెరా బంప్, బబుల్‌గమ్ పింక్, మాట్టే బ్లాక్ బ్రోంజీ సన్ సెట్ గోల్డ్ వంటి కొత్త కలర్ ఆప్షన్‌లతో వస్తుందని అంటున్నారు. దీనిపై ఆపిల్ నుంచి ఎలాంటి స్పందనలేదు.