WhatsApp Update : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్.. రాబోయే రెండు ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఇవే..!

WhatsApp Update : మీ అకౌంట్‌కు యూజర్ నేమ్ యాడ్ చేసేందుకు అనుమతించే ఇంట్రెస్టింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు ఫోన్ నంబర్‌లను హైడ్ చేసే ఆఫ్షన్ కూడా అందిస్తోంది. యూజర్లు కేవలం యూజర్ నేమ్ మాత్రమే చూడగలరు.

WhatsApp Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. వాట్సాప్‌లో రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. అందులో ఒకటి యూజర్ నేమ్ పేర్లను యాడ్ చేయడం, యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేయడం, మరొకటి వీడియో కాల్‌ల సమయంలో స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు. వాట్సాప్ ఇటీవల చాట్ లాక్ ఫీచర్, ఎడిట్ బటన్, మల్టీ మొబైల్ ఫోన్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్ ఉపయోగించే ఆప్షన్‌తో సహా 3 పెద్ద అప్‌డేట్‌లను యాడ్ చేసింది. మెసేజింగ్ యాప్‌కి రానున్న 2 కొత్త మెయిన్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

మీ ఫోన్ నంబర్‌లను హైడ్ చేసేందుకు వాట్సాప్ (WaBetaInfo) షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం.. వాట్సాప్ మీ అకౌంట్ యూజర్ నేమ్ యాడ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు ఫోన్ నంబర్‌లను హైడ్ చేసేందుకు ఆప్షన్ ఇస్తుంది. వాట్సాప్ యూజర్లందరూ యూజర్ నేమ్ మాత్రమే చూడగలరు. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ తమ ఫోన్ నంబర్‌లను బహిర్గతం చేయకుండా యాప్‌లో యూజర్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు.

Read Also : BGMI Play Simple Trick : BGMI గేమ్ ఆడలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌తో బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ఆడుకోవచ్చు..!

వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లకు అదనపు భద్రతను యాడ్ చేయొచ్చు. ఈ ఫీచర్‌కు వాట్సాప్ సెట్టింగ్‌లు > ప్రొఫైల్‌లో స్పెషల్ సెక్షన్ ఉంటుంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్ నేమ్ యాడ్ చేసే కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. భవిష్యత్తులో ఈ కొత్త అప్‌డేట్ మరింత మంది బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. యాప్ స్టేబుల్ వెర్షన్‌లో ఉన్న వారికి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

WhatsApp Update _ Two major features coming to messaging app

వాట్సాప్ స్ర్కీన్‌ని షేర్ చేసుకోవచ్చు :
వాట్సాప్ వీడియో కాల్‌ల సమయంలో మీ ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొత్త ఆప్షన్‌ను యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ యాప్‌ను మెసేజింగ్, కాలింగ్ రెండింటికీ బిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వీడియో కాల్‌లలో స్క్రీన్ షేరింగ్‌ని యాడ్ చేయడం వల్ల (Google Meet) వంటి పోటీదారులు చాలా మందిని తగ్గించవచ్చు. వాట్సాప్ ప్రస్తుతం 32 మంది యూజర్లకు సపోర్టు అందిస్తుంది. ఈ ఫీచర్ యాప్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులో ఉంది. రాబోయే వారాలు లేదా నెలల్లో స్టేబుల్ వెర్షన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్‌లో అందరికి సరికొత్త ఫీచర్లు :
వాట్సాప్ అందరి కోసం కొత్త చాట్ లాక్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. వాట్సాప్ యూజర్లు తమ సూపర్ పర్సనల్ చాట్‌లకు లాక్‌ చేయొచ్చు. తద్వారా మీరు మీ ఫోన్‌ను మరెవరికీ అప్పగించినా ఎవరూ వాటిని యాక్సెస్ చేయలేరు. మంచి విషయం ఏమిటంటే.. కొత్త ఫీచర్ ఆ చాట్‌లోని విషయాలను నోటిఫికేషన్‌లలో ఆటోమాటిక్‌గా హైడ్ చేస్తుంది. మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది. వాట్సాప్ ఎట్టకేలకు అందరికి కొత్త ఎడిట్ బటన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు ఎవరికైనా పంపిన తప్పుడు మెసేజ్‌లను ఏవైనా మార్పులు చేసేందుకు 15 నిమిషాల విండోను పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ మెసేజ్‌ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మెసేజ్‌లో ఎక్కడ డిలీట్ చేయాలనుకుంటే అది మాత్రమే డిలీట్ చేసుకోవచ్చు.

Read Also : Motorola Edge 40 First Sale : మే 30 నుంచి మోటోరోలా ఎడ్జ్ 40 ఫస్ట్ సేల్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

ట్రెండింగ్ వార్తలు