WhatsApp : వాట్సాప్‌ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!

WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ సొంత యాప్ వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సప్ మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా డిలీట్ చేసేయొచ్చు.

WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ సొంత యాప్ వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సప్ మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా డిలీట్ చేసేయొచ్చు. చాట్ బాక్సులోకి వెళ్లి అనవసరమైన మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఒక నిర్దిష్ట సమయానికి అదే ఆటో డిలీట్ చేసేస్తుంది. వాట్సప్ చాట్స్‌కి, గ్రూప్స్‌ చాట్‌లోనూ ఈ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల్లో ఒకటి ఎంచుకోవాలి. సరిగ్గా అదే సమయానికి ఆయా మెసేజ్‌లు డిలీట్ అయిపోతాయి.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ వన్ సైడ్ మాత్రమే వర్క్ అవుతోంది. అంటే.. మీ కాంటాక్ట్స్‌లోని ఎవరి చాట్ అయినా డిసప్పియరింగ్ మెసేజ్ ఎనేబుల్ చేస్తే.. వారు పంపే మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి. వారి చాట్స్‌లో లేదా మీ చాట్స్‌లో ఆయా మెసేజెస్ కనిపించవు. అలాంటి డిలీట్ మెసేజ్ సేవ్ చేసే అవకాశం లేదు. అందుకే వాట్సాప్ ఇప్పుడు ఆ ఫీచర్ తీసుకొస్తోంది.

Whatsapp’s Upcoming Feature May Let You Store Disappearing Messages Forever

మీరు కొన్ని మెసేజెస్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేసినా కూడా ఆ మెసేజ్ చాట్ బాక్సు నుంచి డిలీట్ అవుతుంది. కానీ, ఒక సపరేటు బాక్సులో ఆ మెసేజ్ స్టోర్ అవుతుంది. WABetaInfo ప్రకారం.. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేశాక చాట్స్‌లోని మెసేజ్ యూజర్లు సేవ్ చేసుకోవచ్చు అనమాట.. ఇప్పటికే వాట్సప్ బీటా యూజర్లు ఈ ఫీచర్‌ టెస్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌లో ‘Kept Messages’ పేరుతో కొత్తగా ఒక సెక్షన్ ప్రవేశపెట్టింది వాట్సాప్. ఆ సెక్షన్‌లో యూజర్ సేవ్ చేసిన మెసేజ్ లు స్టోర్ అవుతాయి.

ఆండ్రాయిడ్ యూజర్లకు, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు. ఈ ఫీచర్ ఉంటే.. కాంటాక్ట్స్‌కి, గ్రూప్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్వి నియోగించు కోవచ్చు. ఏ ఛాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేయాలో అదే చాట్ ముందుగా ఓపెన్ చేయాలి. ఆ కాంటాక్ట్ పై క్లిక్ చేయండి. మీకు Disappearing Messages డిఫాల్ట్‌గా డిజేబుల్ అయి ఉంటుంది. మీరు దాన్ని ఎనేబల్ చేయాల్సి ఉంటుంది.

Read Also :  Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!

ట్రెండింగ్ వార్తలు