టిప్స్-ట్రిక్స్ : Windows 10లో Dark Mode సెట్ చేయండిలా!

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ డెడ్ అయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూర్ అప్ డేట్స్ అందిస్తోంది. విండోస్ 7 ఓఎస్ లకు సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. విండోస్ 10లో ఆకర్షణీయమైన ఫీచర్ ఒకటి యూజర్లను కట్టిపడేస్తోంది.
అదే.. డార్క్ మోడ్ ఫీచర్. ఇప్పుడు ఇది విండోస్ 10లోనూ అందుబాటులో ఉంది. కొన్నేళ్ల క్రితం MacOSలో మాత్రమే వచ్చిన ఈ డార్క్ మోడ్.. గత ఏడాదిలో ఆండ్రాయిడ్ 10 రన్ అయ్యే అన్నిసిస్టమ్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ వచ్చేసింది.
లేటెస్ట్ వెర్షన్గూగుల్ మొబైల్ ఓఎస్ లోనూ ఈ ఫీచర్ వచ్చేసింది. ఆపిల్ ఐఫోన్లలో ఐప్యాడ్స్ iOS13, iPadOSలో కూడా డార్క్ థీమ్ వచ్చింది. ఇప్పుడు విండోస్ 10లో కూడా డార్క్ థీమ్ ఉంది. మీ ల్యాప్ టాప్ వాడుతు ఉన్నట్టయితే దాని బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండాలన్నా, మీ కళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉండాలన్నా డార్క్ థీమ్ సెట్ చేసుకోవడం ఎంతో ఉత్తమం.
విండోస్ 10లో డార్క్ మోడ్ ఆప్షన్ డిఫాల్ట్ గా సెట్ చేసుకోవచ్చు. విండోస్ యాప్స్ అన్నింటిలోనూ ఇది సపోర్ట్ చేస్తుంది. కొన్ని పాత విండోస్ యాప్స్.. టాస్క్ మేనేజర్‌లో మాత్రం ఈ డార్క్ మోడ్ ఎనేబుల్ చేయలేరు. ఇంతకీ విండోస్ 10లో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలో ఓసారి చూద్దాం…
1. Start menu నుంచి Settings ఓపెన్ చేయండి.
2. Personalizationపై Tap చేయండి.
3. లెఫ్ట్ నేవిగేషన్ ప్యానెల్ పై Colors Tap చేయండి.
4. లేబుల్ కింద విండోస్ మోడ్ డిఫాల్ట్ Dark బటన్ Turn on చేయండి.
5. Custom నుంచి Color menu ఎంచుకోండి.
6. ఇక్కడే Dark mode ఎంపిక చేసుకోండి.
Turn on డార్క్ మోడ్ – Windows 10 యాప్స్ :
– Start menu నుంచి Settings ఓపెన్ చేయండి.
– Personalizationపై Tap చేసి Colors మెనూపై మరోసారి Tap చేయండి.
– డిపాల్ట్ యాప్ మోడ్ ఎంచుకుని Dark Button టర్న్ ఆన్ చేయండి.
– Custom ఎంచుకుని ఆ తర్వాత Color menu ఎంపిక చేయండి.